Saturday, December 25, 2010

YOGA






Common Causes of Back Pain
1. Incorrect posture - Proper Posture to prevent back pain.
2. Improper movements or bad body mechanics.
3. Repetitive motion on joints or muscles.
4. Disc injury can be the cause of prolonged back pain but muscles and
ligaments may also be damaged or inflamed. Bulging Discs
5. The sacroiliac joint can create pain when it does not sit in its housing correctly.
6. Infections, tumor, cysts and bone spurs.

Best Way To Heal Back Pain
1. A combination of exercise that involves yoga, swimming and weight training
will give you the best results. All these exercises should be done lightly.
2. Correcting posture and movement when sitting, in everyday life
and when you perform back pain exercises you perform.
3. Use a hot tub regularly and get the affected area massaged.
4. Learn to target muscles that are tight and painful with careful stretches.

Best Yoga Postures To Heal Back Pain

Saturday, December 18, 2010

ARTICLES



మనమూ – మన ఆదర్శాలూ సూపరంతే..!!

బహు విచిత్రమైన భావం ఈ ఆదర్శం
నీ ఆదర్శం నాకువికారం, నా ఆదర్శం నీకు వెటకారం
మన ఆదర్శాలన్నీ పొందవు అందరి అంగీకారం
కట్నము తీసుకోని వాడు కావాలనే అమ్మాయి
పెళ్ళికి అవసరమంటుంది వరుడి కులం
లంచము తీసుకోననే ఆదర్శవంతుడు
మామగారి దగ్గర  తీసుకుంటాడు కట్నం
సంక్రాంతికి అడుగుతాడు ‘బైక్’ అనే లంచం
కులవివక్షను వ్యతిరేకించిన పెద్దమనిషి
లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడలేడు
తన భార్యను సమానత్వ  దృష్టితో చూడలేడు.
స్త్రీలపై జరిగే అన్యాయాలపై పోరాడే  స్త్రీవాది
పురుషులపై జరిగే అన్యాయాలను పట్టించుకోదు
మైనారిటీల హక్కులు కోసం పోరాడే ఆదర్శవాదులు
మెజారిటీల హక్కులపై జరిగే దాడి పట్టించుకోరు
ఎందుకంటే …
ప్రతీ మనిషికీ ఉంటుంది ఒక పరిధి
ఆ పరిధిలో ప్రతీ మనిషికీ ఉంటుందో  అనుభవం
ఆ అనుభవం నిర్దేశిస్తుంది మనిషి ఆదర్శం.
ఇరువురి ఆదర్శాలు  అవ్వొచ్చు పరస్పర విరుద్దం
అవి సమాజములోని అసమానతల ఫలితం
యేది యేమైనా,  ఆదర్శం సమాజ నిర్మానానికి తప్పని అవసరం

Sunday, September 26, 2010

Saturday, September 25, 2010

Wednesday, September 15, 2010


ఎయిడ్స్ కి చెబుదాం టాటా

ఎయిడ్స్ కి చెబుదాం టాటాDecember 1st, 2009

ఎయిడ్స్ మన దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో యిది ఒకటి .20 సం. క్రితం ఎయిడ్స్ అంటే ఎరగని భారతదేశంలో ఇప్పుడు(మే 2005 నాటి లెక్కల ప్రకారం )1,09,349 మంది ఎయిడ్స్ మహమ్మారితో బాధపడుతున్నారు. అందులో 37% మంది 30 ఏళ్ళ లోపువారే, 31,982 మంది ఆడవారు. ఇవికాక నమోదు కాని కేసులెన్నో ఉన్నాయి. ఎయిడ్స్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఆఫ్రిక ఖండంవారే. తరవాతి స్థానంలో మన భారతదేశం ఉంది. మన దేశంలో ఎయిడ్స్ బారిన పాడుతున్నవారి సంఖ్యా ఆంధ్రప్రదేశ్లో చాల త్వరగా వ్యాపిస్తుందని NACO చెబుతుంది. మన దేశంలో 10% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆధ్రప్రదేశ్లోనే ఉన్నారు.

పెద్దవాళ్ళు క్షనికావెశమ్లొ చేసిన తప్పుకి (ముఖ్యంగా మగవాళ్ళు ) అభం శుభం ఎరగని పసిప్రాణాలు భాదపడుతున్నాయి . మధ్య వయస్సులోనే తల్లిదండ్రులు మరణిస్తున్నారు. పుట్టుకతోనే చిన్నారులు ఎయిడ్స్ బారినపడటమేగాక, తల్లిదండ్రులులేని అనాధలౌతున్నారు .

ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా వున్నా దేశం చైనా , అభివ్రుద్దికాటంకం జనాభా ఎక్కువగా వుండటమని అన్ని దేశాలు నమ్ముతాయి . కాని, ఆ మాటని అనగత్రోక్కి అభివృద్ది విప్లవాన్ని శ్రుష్టిస్తుంది చైనా. చైనా అభివ్ర్ధధిని అంచనావేయడానికి చక్కని వుదాహరణ భీజింగ్ ఒలంపిక్స్. నిన్నటిదాక జనాబాలో ప్రధమస్థానంలో వున్నా చైనా రేపు ఆర్థికాభివ్రుధ్ధిలొ ప్రధమస్థానంలో వుంటుందనడంలో ఆచర్యపోనక్కరలేదు.

మన ప్రక్క దేశం చైనా అభివృద్ది విప్లవం జరుపుతుంటే, మన దేశం మాత్రం ఎయిడ్స్ విప్లవం జరుపుతుంది. విప్లవమనే ఉన్నతమైన మాటని ఎయిడ్స్ కి అనువదించటం తప్పేకావచ్చు కాని, అతి తక్కువ కాలంలో అతిపెద్ద మార్పుజరుగుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా మంచి మాట లేదనేచేప్పాలి.మన దేశంలో ఎక్కువమంది ఎయిడ్స్ బారిన పడడానికి కారణం నిరక్షరాస్యత, అవగాహనరాహిత్యం మరియు భిధరికం.

ముంబాయ్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని వీధులు పూర్తిగా సెక్స్ వర్కర్సుతో నిండిపోతున్నాయి. యువతులు ఈ ఉభిలోకిదిగడానికి ముఖ్యమైన కారణం భీధరికం. దారిద్రం అనుభవించే కుటుంబాలకి డబ్బు ఎరగా చూపి కొందరు దౌర్భాగ్యులు అభం శభం తెలియని అమ్మాయిల్ని కనీస వయస్సుకూడలేని చిన్నారుల్ని సెక్స్ వర్కర్సుగా మారుస్తున్నారు. కటిక దారిద్రంవల్ల కన్న తల్లిదండ్రులే స్వంత బిడ్డలను అమ్ముకునే పరిస్థితికి దిగజారుతున్నారు. ఈలాంటి దృశ్యాలు ఎక్కువగా గిరిజన తాండాల్లో చూస్తున్నాము.

సెక్స్ వర్కర్స్ ధగ్గరికోచ్చే విటుల్లో ఎక్కువమంది లారిడ్రైవర్లే. కుటుంబాలకి ఎక్కువకాలం దూరంగా ఉండటంవల్ల వీరు ఎక్కువగా రెడ్లైట్ ఎరియాలకి ఆకర్షితులౌతున్నారు. వారు చేసే తప్పుకి వారితో పాటు వారికుటుంబాలు కూడా నాశనమైపోతున్నాయి.

సరే ఇవన్ని మనకు తెలిసినవిషయలే. కాని, తెలిసినా మనమేమి చేస్తున్నాము? ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా హింసించడంతప్ప. ఇది మనసున్నవాళ్ళు చేయాలిసిన పనికాదు. మనమొక్కరమే బాగుంటే చాలు అనుకోకుండా మనప్రక్కవాళ్ళు కూడా బాగుండాలని అనుకోవాలి. ఎవరో చేస్తున్న తప్పులకి మనమేమిచేయగలం అని అనుకుంటే ఏమి చేయలేము కాని,మనిషితలచుకుంటే అసాధ్యమైంది ఏది లేదు.

ఎయిడ్స్ అంటే నయంకాని జబ్బని చాలామందికి తెలుసు. కాని, ఎ ఎ కారణాలవల్ల ఎయిడ్స్ వస్తుందనేది కొద్ది మందికే తెలుసు. ఇక్కడే మన బాధ్యత మొదలౌతుంది. ఎయిడ్స్ రావడనికిగల కారణాలు, ఎయిడ్స్ రాకుండా నివారనమార్గలేంటి, ఒకవేళ పొరపాటున ఎయిడ్స్ బారిన పడినవారికి ఎలా చేయుతనివ్వాలి అనే విషయాలను
ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే ఎయిడ్స్ బారిన పడే వారి సంఖ్య తగ్గుతుంది అంతే కాకా ఎయిడ్స్ బారిన పడిన వారు
నిరాదరణకి గురికారు.

మనం ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, తప్పుడు పనులు చేసినవారే ఎయిడ్స్ బారిన పాడుతారు, ఎయిడ్స్ వల్ల జనాభా తగ్గుతుంది అని వెర్రిగా ఆలోచించేవారు ఒకటాలోచించాలి ఎయిడ్స్ కేవలం లైంగిక చర్యలవల్ల మాత్రమే వ్యాపించదు కలుషిత రక్తమార్పిడి, పరిశుభ్రంగాలేని సిరంజిలు మరియు బ్లేడ్లతో కూడా వస్తుంది. మనంకాని మన బందువులుకాని తప్పుడు పనులు చేయకున్నా,షేవింగ్ చేయించుకున్నపుడో,ఇంజక్షన్ చేయించుకున్నప్పుడో లేక పచ్చబొట్టు (టాటు) పోడిపించుకున్నపుడో పొరపాటున ఎయిడ్స్ బారిన పడవచ్చు . అప్పుడు ఎయిడ్స్ వల్ల తగ్గే జనాభాలో మనమొ మన బందువులో ఉండచ్చుగా అందుకే వెర్రిగా కాకుండా సేవాభావంతో ఆలోచించుదాం.

ఈ జనంలో మనమొక్కరమేకాదు ఈ జనంలో మనమొకరిమి మాత్రమే కదా. కనుక సాటివారికి సహాయ పడుదామనే ధృక్పదంతో ముందుకు సాగుతాం. ఎయిడ్స్ పై అందరికి అవగాహనా కలిగించి, ఎయిడ్స్ ని నివారించడంలో మనమూ ఒక సైనికుడౌధాం. ఎయిడ్స్ రహిత సమాజానికి దారి చూపిస్తామని మన మనసాక్షిపై ప్రమాణం చేదాం. సరేనా నా.. మంచి మిత్రులారా.

"ఇది వేదాంతం కాదు వాస్తవం " 

Sunday, August 1, 2010

Sunday, June 13, 2010

telugu



నా మాట
నా తల్లి నేర్పిన మొదటి పలుకు తెలుగు
నా తండ్రి కట్టిన పట్టుదట్టీ తెలుగు
నా చెల్లి బుగ్గన సిగ్గునిగ్గు తెలుగు
నా చెలియ కన్నుల వెలుగురేఖ తెలుగు

Saturday, April 17, 2010

plans-youth parliment

BHUMI Introduces Children's Parliaments in Hyderabad

Present day challenges like inequalities, poverty, corruption, terrorism, unemployment, lack of basic humanity, disease, casteism, communalism , atrocities against women, children and the socially and economically weak are a direct result of the lack of basic human relationships among people and people’s (at individual level) active participation in governance. To address these challenges starting at the level of Rasulpura, we promote a platform for children where they can cultivate basic human relationships among themselves in their own neighborhood and learn the importance of children’s participation in self-governance through a program called “Children’s Parliament”. By educating, organizing and empowering them, the much needed social change will be achieved.

All the children between 6 to 14 years in a neighborhood form a parliament, irrespective of their caste, community, race, social and economical status or their educational status. Every child in the particular neighborhood is an equal member of the said Parliament.

While undergoing a diverse range of trainings they elect various ministers among themselves, like their prime minister, home, finance, education, health ministers etc etc through a consensus and objection less election process. Each member is responsible for something. These parliaments will be networked by representation at village, panchayat, block, district, state and national levels. The children also undergo trainings in the actual functioning of the govt., its various departments, schemes available etc etc.

Slowly, being guided by mentors from the community and from BHUMI, they start convening in formal parliamentary meetings once a week and discuss any matters or problems from their own community put forward by each minister and if need be, they chart out action plans, methods and time frame for its implementation on ground. Mind you this is real work on ground not a classroom role play.

In a first of its kind initiative in the city, Children’s Parliament - Hyderabad chapter was launched by BHUMI on Children’s Day 2009 with one batch of 18 children belonging to the Pochamma temple basti in Rasoolpura, Hyderabad. The parliament conducted a swearing in ceremony of the ministers. The event was attended by local politicians and Mr. Joseph Rathnam, the Founder of the Children’s Parliament Movement.

BHUMI has structured a year-long training program for the first batch of CP to educate and support them in their roles and give them the opportunity to groom themselves into responsible human beings and future leaders. The children are presently undergoing training on life skills and functional aspects of Children’s Parliament (CP).

A mentor belonging to the same community is attached to the parliament who supervises and facilitates the batch. This mentor is also being groomed to become a life skills trainer for young children and an expert on CP.

Be hooked on for more on Children’s Parliament in the later editions!

Thursday, April 15, 2010

Tuesday, April 6, 2010

Arthur Ashe వింబుల్డన్ ఆటగాడు

జీవన సౌందర్యం:

 

ఆర్థుర్ అషే (Arthur Ashe) గొప్ప వింబుల్డన్ ఆటగాడు. అతడు క్యాన్సర్ తో బాద పడుతున్నాడు. ప్రపంచం నలుదిక్కుల నుండి అతని అభిమానుల నుండి అతనికి ఉత్తరాలు అందుతున్నాయి. ఒక అభిమాని ఈ విధంగా వ్రాసాడు.

" ఆ భగవంతుడు మీమ్మల్నే ఎందుకు ఇలా వ్యాధిగ్రస్తుడిని చెయ్యాలి. "

దానికి ఆర్థుర్ గారు ఈ విధంగా బదులిచ్చారు.

" ఈ ప్రపంచం మొత్తంలో బహుశా 5 కోట్ల మంది టెన్నస్ ఆడటం మొదలుపెట్టారు; వారిలో 50 లక్షల మంది దానిని నేర్చుకోగలిగారు; వారిలో 5 లక్షల మంది దానినే జీవనోపాధిగా ఎంచుకున్నారు; వారిలో 50 వేల మంది బరిలోకి వెళ్ళగలుగుతున్నారు; వారిలో 5 వేల మంది వింబుల్డన్లో ఆడగలిగారు; వారిలో నలుగురు సెమీ ఫైనల్స్ కి .... ఇద్దరు ఫైనల్స్ కి... చివరికి ఫైనల్ లో నేను గెలిచిన సంతోష సమయంలో నన్నే ఎందుకు విజేతగా చేసావు అని ఆ భగవంతుడిని నేను అడగలేదు. అందుకే ఇప్పుడు ఈ భాదలో నేను అడగలేను "

- ఈ స్వేచ్ఛానువాదంలో లోపాలు ఉంటే మన్నించగలరు.

Sunday, January 3, 2010

TIPS

 


 

మీరు ఫంక్షన్‌కు వెళుతున్నారా? అయితే వీటిని పాటించండి.

ఈ నెలలో చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదూ? పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఎంగేజ్‌మెంట్ పార్టీలు ఇలా బోలెడు ఫంక్షన్లకు ఆహ్వానాలు అంది ఉంటాయి. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తే వేడుకలో మీరే ప్రధాన ఆకర్షణ అవుతారు. లేకపోతే వెళ్లామా... వచ్చామా అన్న చందంగా మిగులుతుంది. ఫంక్షన్‌లకు వెళ్లే సమయంలో ఎలా ఉండాలో తెలుసుకుందాము. 


  •   ఫంక్షన్‌లో మీరు ఎంత సేపు ఉండాల్సి వస్తుంది. మీరు వెళుతున్నది ఎలాంటి ఫంక్షన్ అనే విషయాన్ని మననం చేసుకోండి. ఎక్కువ సేపు ఉండాల్సిన ఫంక్షన్ అయితే మరో జత బట్టలు పెట్టుకోండి. రోజంతా అదే డ్రెస్‌తో ఉండే కంటే కాస్త సేదతీరి, డ్రెస్‌మార్చుకుంటే ఫ్రెష్‌గా కనిపిస్తారు.
  •   ఫంక్షన్‌లో మీ ఇంట్లో వాళ్లనే అంటిపెట్టుకొని ఉండకుండా కొత్తవారితో పరిచయాలు పెంచుకోండి. బంధుమిత్రులందరినీ ఆప్యాయంగా పలకరించండి. పరిచయాలు పెంచుకొనేందుకు, ఉన్న పరిచయాలను పటిష్టం చేసుకొనేందుకు అదో మంచి అవకాశం అని గ్రహించండి.
  •   ఫంక్షన్లో అవసరమైన చోట చొరవ చూపండి. అనవసరంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం పెరగక పోగా తగ్గుతుందని గ్రహించండి.
  •   ఫంక్షన్‌కు వెళ్లి మొక్కుబడిగా ఐదునిముషాలు ఉండి వెళ్లిపోతారు కొందరు. ఆలా కాకుండా వేడుకలో ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని పిలిచిన వారికి, మీకూ సంతోషం మిగులుతుంది.
  • మీరు ఎంపిక చేసే బహుమతి వారు ఉపయోగించుకొనేదిగా ఉండేలా చూసుకోండి. ధర ఎక్కువా.. తక్కువా అని కాకుండా ఉపయోగం ఎంత అనే విషయాన్ని గమనించండి.
  •  ఫంక్షన్లలో చాలా మంది కుటుంబ పెద్దలు కలుస్తారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించండి. అంతమంది సీనియర్లను ఫంక్షన్ల సమయంలో మాత్రమే ఒకచోట కలుసుకుంటారు.

Saturday, June 13, 2009

పసివాడి హృదయం కరిగింది

పసివాడి హృదయం కరిగింది

"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు.  ఈ ఘటన 2006లో జరిగింది.from unicef

Tuesday, June 2, 2009

వానా వానా వందనం...:

వానా వానా వందనం...:


'సువాసన పిలుపువంటిది- పదిమందినీ ఆకర్షిస్తుంది. సౌరభం పక్షివంటిది- దిక్కుదిక్కులా పరుగెత్తుతుంది. సుగంధం స్మృతివంటిది- పదేపదే స్ఫురిస్తుంది...' అంటూ వర్ణించిన కృష్ణశాస్త్రి, పరిమళాన్ని మాత్రం 'సమయం చూసి దగ్గర చేరే నేస్తం'గా పోల్చిచెప్పారు. వర్షపు చినుకుకీ- నేలతల్లికీ గొప్ప స్నేహం. సమయం చూసి తొలకరి చినుకు నేలను తాకగానే కమ్మని పరిమళం వెదజల్లడం- మట్టి స్వభావం! తీవ్రమైన ఎండల వేడికి ప్రాణం సొమ్మసిల్లిపోయిన సమస్త జీవజాలంతోపాటు, భూమిసైతం తొలకరికోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. స్వాతి చినుకును ప్రేమగా స్వాగతిస్తుంది. కమ్మని పరిమళాన్ని వెదజల్లడం ద్వారా తన పులకరింతను వ్యక్తం చేస్తుంది. కాంతిని దీపం పీల్చుకున్నట్లుగా, వర్షాన్ని పీల్చుకుని భూమి సురభిళించడం- సృష్టికి శోభను చేకూర్చే అంశం. ప్రకృతికి జీవంపోసే విషయం. 'గ్రీష్మాదిత్య పటుప్రతాపాని'కి, తీవ్రతాపానికీ ప్రాణం డస్సిపోయిన స్థితిలో తొలకరి పలకరింత- సృష్టికి పులకరింత. అందుకే వర్షర్తువును జీవరుతువంటారు. 'ప్రాణం లేచొచ్చినట్లు' అనిపించేది వర్షాగమనానికే! రోహిణీకార్తెకు వీడ్కోలుపలికి, మృగశిర ప్రవేశించడం మనకి తొలకరి. అంతవరకూ భూమి నుండి అదేపనిగా నీటిని పీల్చుకున్న ఆకాశం సమయం చూసి బదులు తీర్చేస్తుంది. నీటిని వర్షిస్తుంది. ఇది పంచభూతాల మధ్య సృష్టి కుదర్చిన ఒక ఒప్పందం. బాకీ తీర్చేవాడికోసం మనం కళ్ళు విప్పార్చి ఎదురుచూసినట్లుగానే- వర్షపు చినుకుకోసం నోరు తెరిచి కూర్చున్నట్లుగా భూమి నెర్రెలు విచ్చి ఎదురుచూస్తుంది. ఆషాఢమూ, శ్రావణమూ, భాద్రపదమూ, ఆశ్వీయుజమూ నాలుగూ వార్షుకమాసాలు. వానకారు. నీరే జీవులకు ప్రాణాధారం. ప్రాణులకోసమే భూమి వర్షాన్ని ఆశిస్తుంది. అది తల్లి స్వభావం. అందుకే నేలను భూమాత అంటాం. వర్షమే భూమిపై పాడిపంటలకు, సిరి సంపదలకు మూలం. వర్షం లేకపోతే కరువు కాటకాలు ఏర్పడతాయి. వర్షపు లేమి- అనే అర్ధంలో క్షామాన్ని 'వర్షపు టెవ్వ'గా పేర్కొన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అడవికి ఆమని- కోరిక. వయసుకు వలపు- కానుక. పుడమికి తొలకరి- వేడుక! గొప్ప సంబరం!

వర్షర్తువు- సాహిత్యవర్ణనలకి అద్భుతమైన కొలువు. కవిసమయాలకి అందమైన నెలవు. 'కురిసేదాకా అనుకోలేదు- శ్రావణమేఘమని, తడిసేదాకా అనుకోలేదు- తీరని దాహమని' అని ఆశ్చర్యపడిన సినీకవి వేటూరి నుండి వెనక్కువెళ్ళేకొద్దీ- జాబితా ఆదికవి వాల్మీకి దాకా విస్తరిస్తుంది. 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు. కొంచెకొంచెమేని, రాలాలి తుంపరులుయేని. కాని ఉక్క ఏ మాత్రము ఉండరాదు' అని కృష్ణశాస్త్రి కోరుకున్నారు. మనిషి స్వార్థాన్ని నిలదీస్తూ 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?' అని ప్రశ్నించారు జయప్రభ. పింగళి కాటూరి కవుల 'తొలకరి', ఇస్మాయిల్‌ 'రాత్రి వచ్చిన రహస్యపువాన' వంటివి యువతరం స్మృతిపథంలోని లేతచినుకులు- అనుకుంటే, వాల్మీకి కిష్కింధాకాండ. నన్నెచోడుడి 'కుమారసంభవం'.. వంటివి రసజ్ఞుల గుండెల్లో స్వాతి చినుకులు. పరమశివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంటే- ఆమె పాపిట రాలిన వర్షబిందువు కిందకి జారి, నాభిదాకా ప్రయాణించిన వైనాన్ని వర్ణిస్తూ చెప్పిన- స్థితాఃక్షణం... నాభిం ప్రథమోద బిందవః శ్లోకంలో ఆమె స్థిరదీక్షా భంగిమను కాళిదాసు వర్ణించిన తీరు- రసజ్ఞతకు అమృత జీవధార. కాళిదాసుదేనని చాలామంది భావిస్తున్న ఘటకర్పర కావ్యంలో 'మేఘావృతం నిశి న భాతి నభో వితారం'... శ్లోకం వ్యంగ్యార్థపు చినుకుల్లోంచి రూపుదిద్దుకున్న స్వాతిముత్యం. కృష్ణదేవరాయల వర్షర్తువర్ణనమైతే ఒక దట్టమైన జడివాన. కృష్ణరాయల కవిత్వమే ఒక గొప్ప వర్షర్తువు- అన్నారొక భావుకపట్టభద్రుడు. వర్షర్తువు సాహిత్యాటవికి వసంతరుతువు. సాహిత్యపు విందులలో రుచికరమైన ఆధరువు.

వర్షం కురిసి వెలిసింది. మబ్బులు తెల్లబడ్డాయి. వాటి మధ్య ఒక సంధ్యారుణ రేఖ మెరిసింది. అదెలా ఉందో తెలుసా? చేతికి గాయమై, కట్టుకట్టినప్పుడు- చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఎర్రగా ఉంటుందికదా! అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి. అతి ప్రాచీనకావ్యంలో అధునాతన అభివ్యక్తిని ప్రదర్శించినది- వాల్మీకి అయితే, ఆధునిక కావ్యంలో ప్రాచీన వైదిక పరిమళాన్ని పరిచయం చేసినవారు శేషేంద్ర. అదే నిజానికి వర్షాల ప్రయోజనం కూడా! కవులంతా సౌందర్యాన్ని వర్ణించగా, వేదం మాత్రం వర్షం ప్రయోజనాన్ని ప్రకటించింది. గ్రీష్మకాలే దావాగ్ని నా దగ్ధప్రదేశే, అచిరకాలే వర్షర్తౌ వృష్టి పతనేన- భూయస్యః కోమల యుక్తాశ్చ ఓషధయః ప్రజాయన్తే!- గ్రీష్మరుతువులో దావాగ్ని కారణంగా దగ్ధమైన ప్రదేశాలన్నింటా వర్షాలు పడ్డాక కోమలమైన ఔషధీ లతలు, రోగనివారణా మూలికలు పూర్వంకన్నా అధికసంఖ్యలో పుట్టుకొస్తాయని వేదం చెప్పింది. ఇదీ వర్షం బాపతు పరమ ప్రయోజనం. భూమి తాలూకు పరమ సార్ధక్యం. రుతు పరిణామానికి ధన్యత అదే! దీన్ని దృష్టిలో పెట్టుకునే శేషేంద్ర ఆ పరిణామక్రమానికి ప్రణామాలు చేశారు- ఒక కవితలో... 'వర్షం వెళ్ళిపోయింది- మబ్బుల రథాలెక్కి/ జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు/ భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి/ మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది... కృతజ్ఞతతో...' అన్నారాయన. దీన్ని ఆకళించుకుంటే వర్షకళ లక్ష్యం బోధపడుతుంది. వానా వానా వందనం అని ఎందుకు మొక్కాలో తెలుస్తుంది.(ఈనాడు, సంపాదకీయం, 08:06:2008)

Search This Blog