Sunday, January 3, 2010

TIPS

 


 

మీరు ఫంక్షన్‌కు వెళుతున్నారా? అయితే వీటిని పాటించండి.

ఈ నెలలో చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదూ? పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఎంగేజ్‌మెంట్ పార్టీలు ఇలా బోలెడు ఫంక్షన్లకు ఆహ్వానాలు అంది ఉంటాయి. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తే వేడుకలో మీరే ప్రధాన ఆకర్షణ అవుతారు. లేకపోతే వెళ్లామా... వచ్చామా అన్న చందంగా మిగులుతుంది. ఫంక్షన్‌లకు వెళ్లే సమయంలో ఎలా ఉండాలో తెలుసుకుందాము. 


  •   ఫంక్షన్‌లో మీరు ఎంత సేపు ఉండాల్సి వస్తుంది. మీరు వెళుతున్నది ఎలాంటి ఫంక్షన్ అనే విషయాన్ని మననం చేసుకోండి. ఎక్కువ సేపు ఉండాల్సిన ఫంక్షన్ అయితే మరో జత బట్టలు పెట్టుకోండి. రోజంతా అదే డ్రెస్‌తో ఉండే కంటే కాస్త సేదతీరి, డ్రెస్‌మార్చుకుంటే ఫ్రెష్‌గా కనిపిస్తారు.
  •   ఫంక్షన్‌లో మీ ఇంట్లో వాళ్లనే అంటిపెట్టుకొని ఉండకుండా కొత్తవారితో పరిచయాలు పెంచుకోండి. బంధుమిత్రులందరినీ ఆప్యాయంగా పలకరించండి. పరిచయాలు పెంచుకొనేందుకు, ఉన్న పరిచయాలను పటిష్టం చేసుకొనేందుకు అదో మంచి అవకాశం అని గ్రహించండి.
  •   ఫంక్షన్లో అవసరమైన చోట చొరవ చూపండి. అనవసరంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం పెరగక పోగా తగ్గుతుందని గ్రహించండి.
  •   ఫంక్షన్‌కు వెళ్లి మొక్కుబడిగా ఐదునిముషాలు ఉండి వెళ్లిపోతారు కొందరు. ఆలా కాకుండా వేడుకలో ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని పిలిచిన వారికి, మీకూ సంతోషం మిగులుతుంది.
  • మీరు ఎంపిక చేసే బహుమతి వారు ఉపయోగించుకొనేదిగా ఉండేలా చూసుకోండి. ధర ఎక్కువా.. తక్కువా అని కాకుండా ఉపయోగం ఎంత అనే విషయాన్ని గమనించండి.
  •  ఫంక్షన్లలో చాలా మంది కుటుంబ పెద్దలు కలుస్తారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించండి. అంతమంది సీనియర్లను ఫంక్షన్ల సమయంలో మాత్రమే ఒకచోట కలుసుకుంటారు.

Search This Blog