Friday, September 23, 2011

విండోస్ 8 వచ్చేస్తోంది:

పర్సనల్ కంప్యూటర్‌ను వాడటంలో కొత్త అనుభవాన్ని ‘విండోస్’ ఆపరేటింగ్ సిస్టం ద్వారా రుచి చూపింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ‘విండోస్’ ఆపరేటింగ్ సిస్టం మొదట్లో డాస్ ఆపరేటింగ్ సిస్టంలో పనే్జసేది. నెమ్మదిగా డాస్‌ను తనలోకి ఇమిడ్చేసుకొంది. కమాండ్స్ ఇచ్చేపనే లేకుండా అంతా వౌస్ ‘క్లిక్’లతో పనికానిచ్చేస్తుంది విండోస్. ఇంటర్నెట్, వెబ్‌సైట్ డిజైన్, డాక్యుమెంట్స్ రూపొందించడం, పవర్ పాయింట్స్ చేసుకోడం, ఆడియో, వీడియో -ఇలా అన్నిరంగాల్లో ఎనె్నన్నో సులువుగా వాడే వీలుండే సౌకర్యాలను రూపొందించి యూసర్లను పర్సనల్ కంప్యూటర్లనూ కలిపి విడదీయరాని బంధాన్ని ఏర్పరిచింది. విండోస్ 95, 98, ష, 2000, 2003 తి-, విస్తా, విండోస్-7 ఇలా ఎప్పటికప్పుడు పాత లోపాలను సరిదిద్దుతూ లేని కొత్త సౌకర్యాలనిస్తూ పలు వెర్షన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది మైక్రోసాఫ్ట్.
‘విస్తా’లో సత్తా లేకపోయినా విండోస్-7తో నిలదొక్కుకుంది మైక్రోసాఫ్ట్. విండోస్-7లో అద్భుతాలేవీ లేకపోయినా, అన్ని ఆప్షన్లు సరిగా పనిచేయడం కొంత రిలీఫ్ నిచ్చింది. అయతే విండోస్-7లో పాత వెర్షన్ సాఫ్ట్‌వేర్‌తో, అప్లికేషన్లు సరిగా పని చేయడం లేదు. కొన్ని ఉపకరణాలు వాడటాన్కి సరైన డ్రైవర్స్ ఇప్పటిదాకా రూపుదిద్దుకోలేదు. అయనాసరే పట్టువదలని విక్రమార్కునిలా మైక్రో సాఫ్ట్ ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లను తెస్తూనే ఉంది. పట్టువదలని విక్రమార్కుల్లా యూసర్లు వాటికై వెంపర్లాడుతూ, ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు విండోస్-8 అనే కొత్త వర్షన్‌కు మైక్రో సాఫ్ట్ రూపకల్పన చేస్తోంది. డెవలపర్ల కోసం ఫ్రీగా ‘డెవలపర్ ప్రివ్యూ’ అంటూ అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్. మూడురకాల డిఫరెంట్ ప్యాకేజీలుగా అంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం (డెవలపర్ టూల్స్‌తో సహా) -అని మూడు రకాలుగా లభిస్తోంది.
విండోస్ 8ని వాడాలీ అనుకుంటే ఇదివరకే విండోస్ 7 వాడేవారికి ఎలాంటి సమస్యా ఉండదు. ప్రస్తుతం మీరు వాడే పీసీల్లో ల్యాప్‌టాప్‌ల్లో ఏ సమస్యా లేకుండా పనే్జస్తుంది. విండోస్-8ని వాడాలీ అంటే కనీసం 1ద్హిచీ లేదా అంతకన్నా వేగం ఉంటే 32 బిట్/ 64 బిట్ ప్రాసెసర్ ఉండాలి. 32 బిట్ ప్రాసెసర్‌కైతే 1జిబి కనీస రామ్, 64బిట్ ప్రాసెసర్‌కైతే కనీసం 2 జిబి రామ్ ఉండాలి. డిస్క్‌లో 16 జిబి డిస్క్ స్పేస్ (32 బిట్‌కైతే) లేదా 20 జిబి డిస్క్ స్పేస్ (64 బిట్‌కైతే) ఉండాలి. డైరెక్ట్ ఎక్స్9 గ్రాఫిక్స్ ప్రాసెసర్, 1024న768 రెజల్యూషన్‌తో పనిచేసే మల్టీ టచ్ స్క్రీన్ ఉంటే యూసర్ ఇంటర్‌ఫేస్‌లోని కొత్త సౌకర్యాలనూ ‘్ఫల్’ అవ్వచ్చు. అదేం లేకపోయినా మీరు ఫీలవ్వాల్సిందేమీ లేదు.
అప్లికేషన్స్ అన్నీ ‘టైల్ లే అవుట్’లో బాక్స్‌లల్లో తెరపై కనిపిస్తాయి. దీనే్న దిశ్రీని అనకుండా శ్రీని అంటున్నారు. శ్రీని అంటే మెట్రో యూసర్ ఇంటర్‌ఫేస్. ఇది టచ్ స్క్రీన్ పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఈ బాక్స్‌ల్లో ఉండే అప్లికేషన్స్ పీసీలో ఇంటర్నెట్ కనెక్ట్ కాగానే అప్‌డేట్ అవుతాయి కూడా. రెండు అప్లికేషన్స్‌ను ఏకకాలంలో ‘టచ్’ చేస్తూ ఫీలవ్వచ్చు. విండోస్-8లో బూటింగ్, షట్‌డౌన్ మరింత వేగం పెరగనుంది. ఆన్ చేయగానే కేవలం 10 సెకన్లలో సిస్టం రెడీ. టచ్ కీబోర్డు, లాంగ్వేజి ఎంచుకోగానే మార్పులు జరిగిపోవడం -అదో ప్రత్యేకత. విండోస్ ఎక్స్‌ప్లోరర్ రూపు మారుతోంది. ఫైల్ కాపీ చేయడం, పేర్లు మార్చడం -వీటిలో కొంత కొత్తదనం రానుంది.
అప్లికేషన్స్ అన్నీ వెబ్ సర్వీసులతో కలిసి పని చేస్తాయి. అంటే ఏ గూగుల్ ప్లస్‌లోనో, ఆర్కూట్ లేదా ఫేస్ బుక్‌లోకి ఫొటో అప్‌లోడింగ్ నేరుగా విండోస్ ఎక్స్‌ప్లోరర్ నించే చేసేయొచ్చు. యాపిల్-ఐ స్టోర్ లాగా విండోస్-8 కూడా అప్లికేషన్ స్టోర్‌ని ప్రవేశ పెట్టనుంది. పీసీ, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, నెట్ బుక్, టాబ్లెట్ -అన్నిటికీ విండోస్ 8ను వాడేలా రూపొందుతోంది. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న స్క్రై డ్రైవ్ -ఉచిత స్టోరేజీని కూడా వాడేసుకోవచ్చు. ఆటోమేటిగ్గా సింక్రనైజ్ చేసుకోనూ వచ్చు.
విండోస్-లకు అప్‌గ్రేడ్ కావాలంటే కేవలం 30 నిమిషాలు చాలు అంటున్నారు. విండోస్-7లో పనే్జస్తున్న అప్లికేషన్స్ అన్నీ విండోస్-8లో యథాతథంగా పనే్జస్తాయంటున్నారు. మరి విండోస్-ఎక్స్‌పి వాడేవారి సంగతేంటో! ఏవౌతుందో తెలీడం లేదు.
దీనిలో వాడే ‘విండోస్ టు గో’ అనే సౌకర్యం మాత్రం బాగుంటుందేమో అంటున్నారంతా. లైవ్ యుఎస్‌బి అనే పేరుతో యుఎస్‌బి డివైజ్ ద్వారా ఈ సౌకర్యాన్ని వాడి పీసిని బూట్ చేయగల్గడం విశేషం. ఇది మెరుగైన భద్రతనిస్తుందని అంటున్నారు. ధైర్యముంటే ప్రివ్యూని వాడి చూడండి.

courtesy..from andraboomi

Thursday, September 8, 2011

 

ఉగ్రవాదం – చేతకాని పరిపాలన:

ఉగ్ర వాదులు నిర్దాక్షిణ్యంగా మారణహోమం సాగించేరు.
న్యాయం గురించి, న్యాయం కోసం పొద్దున్నే న్యాయస్థానానికి వచ్చిన పౌరులు విశ్వ న్యాయాధికారిని చేరున్నారు!
గాయపడినవారూ, అసువులు బాసిన వారి కుటుంబీకులే కాదు వార్త విన్న ప్రతి భారతీయుడి మనసు కలతబారింది.
వార్త విన్న వెంటనే చలించిపోయినా తర్వాత తొందరగానే కోలుకున్నాను.  ధైర్యమూ వచ్చింది.ఎందుకంటారా?
మన గృహ మంత్రి శ్రీ చిదంబరంగారు ఈ  ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండించారు.
లోతుగా విచారించటానికి ఎన్ ఐ ఏ కి భాద్యతలు అప్పగించేరు !
ప్రధాన మంత్రిగారు ఈ చర్యకి బాధ్యులైన ఉగ్రవాదులని ఏమైనా సరే వదిలేది లేదని ఉద్ఘాటించేరు!
అందు చేత నాకు ఎనలేని ధైర్యం కలిగింది.
సాక్షాత్తూ దేశ ప్రధాని హామీ ఇచ్చిన తర్వాత, దేశ గృహ మత్రిగారు ఆశ్వాసించిన తర్వాత మనకిక భయమేమిటి? దోషులు తప్పకుండా పట్టుబడతారు  శిక్షింపబడతారు కూడా! అణుమత్రం సందేహం లేదు.

ప్రతిమాటూ ఘటనా స్థలిలో  బోనులో పడ్డ ఎలుకలగా ముంబై తాజ్ మహల్ హోటల్   సంఘటనలో  వాడెవడో చిక్కినట్లు అక్కరలేదు.
ప్రధాని వొదలం అన్నారు. వదలదు ప్రభుత్వం అంతే. మరో మాటలేదు!

అంతే కాదు  మనం అందరం సమైక్యంగా వుండి దేశాన్ని ఇలాంటి విపత్తుల నుండి  కాపాడాలని కూడా మన భ బాధ్యతలని గౌ. గృహ మంత్రి గారు గుర్తుచెసేరు!
‘ అంటే ఇంతకు ముందు ఢిల్లీలో జరిగిన అర డజను దాడులు, హైదరాబాదులో జరిగిన గోకుల్ చాట్,
లుంబినీ పార్కు, మక్కా మసీదు పేలుళ్ళు, ముంబైలో జరిగిన ఝవేరీ బజారు  , తాజ్ మహల్ హోటల్ పేలుళ్ళూ, జైపూర్, వారణాసి  , లక్నౌ… చెప్పుకుంటూ పోతే కొండవీటి చేంతాడులా పెరిగిపోయే ఉగ్రవాద దాడులన్నీ కేవలం  పౌరుల్లో సమైక్యత లెకపోవటం వలన మాత్రమే జరిగేయని ప్రభుత్వ ఉద్దేశమా?’ అని అడిగే కువిమర్శకుల మాటలు నేను పట్టించుకోను. వాళ్ళు కేవలం విమర్శించటమే పనిగా పెట్టుకునే పని లేని మంగళ్ళు!
లేకపోతే ఏమిటండీ! ఈ దేశ అనధికార రాజకుమారుడూ, సాక్షాత్తూ ప్రధాని గారిచేతే అనిపించుకున్న భవిష్యత్ ప్రధాన మంత్రీ అయిన శ్రీ రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పేరు ” ఉగ్రవాద దాడులని ఆపటం ప్రభుత్వం వల్ల కాదు ” అని.

అలాంటప్పుడు గతంలో జరిగిన దాడులని వరుస పెట్టి ఏకరు పెడితే ఏమిటి అర్ధం?
కోడిగుడ్డుకి ఈకలుపీకటమే గదా. బుద్ధి వుందా వీళ్ళకి? ఇదా సమయం? అవతల దేశం గురించి ప్రధాన మంత్రీగృహ మంత్రి అంత తీవ్రంగా బాధపడుతుంటే  విపత్కర సమయాల్లో విమర్శలేమిటి?  అంతా సద్దుమణిగిన తర్వాత మాట్లాడవచ్చు కదా.
” కాలం గడిచేసే సరికి సామాన్యులు నిత్యజీవితంలో పడి అడిగే అవకాశమే వుండదు, అదేనా కావల్సింది?  దానితో ప్రభుత్వం చేతులు కడిగేసుకుంటుందా? ” అంటాడు మా శంకరం.
వాడు చెప్పడు కానీ చిన్నప్పుడు కాకీ నిక్కర్లు వేసుకుని కఱ్ఱ పుచ్చుకు తిరిగేవాడని నా నమ్మకం.

“ఇది వితండ వాదం. ఇప్పుడు దారుణం జరిగిన వెంటనే  గృహ మంత్రి గారు స్పందించిన తీరు చూస్తేనే వారు విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణించారో అర్ధం కావటం లేదూ?”
“ఆయన హోం మినిస్టరా ఇంటెలిజెన్స్ మినిస్టరా?”
“అదేమిటి?”
“లేకపోతే ఏమిటి? పేలుళ్ళు సంభవించినప్పుడల్లా అయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాష్ట్రాలకి అందజెసేం అంటాడు, అక్కడికి ఆయన భాద్యత అంతవరకేనన్నట్లు .   అన్ని రాష్ట్రాలవాళ్ళూ వాళ్ళ భద్రత వాళ్ళే చూసుకునేటట్లైతే మరి కేంద్రం ఏమి చేస్తుందట?  రాష్ట్రాలతో చర్చించి , పర్యవేక్షించి దేశ సమగ్రత, సమైక్యత కాపాడటం కేంద్ర గృహ మంత్రి భాద్యత కాకపోతే ఇంకేమిటి ?  అంతే కాదు ఆయన అందించే సమాచారంలో ఎక్కడ, ఎవరు,వగైరాలేమీ వుండవు. ఉగ్ర వాదులెవరో మీ రాష్ట్రంలో ఎప్పుడో పేలుళ్ళకి తెగబడే అవకాశం ఉంది అని మాత్రమే . ఇంత ‘వివరమైన’ సమాచారంతో ఎవరు  మాత్రం చెయ్యగలిగిమేమిటి? అందుకేనేమో మీ యువరాజు గారు ఉగ్రవాద దాడులని ఆపలేము అన్నారు.   మేడ్ ఫర్ ఈచ్ అదర్!”
ఇలాంటి వ్యాఖ్యలకి మాట్లాడేదేమి వుంటుంది?
“ఆయన మాటలు వింటుంటే దాడి జరిగినందుకు బాధ పడుతున్నట్లు  వుండదు. కేవలం తను సరీగా పనిచెయ్యక  పోవటం బయటపడుతున్నట్లుందేమోనని నెపం ఇంకొకరి మీదకు తోసెయ్యటం అత్యవసరం అన్నట్లుగా వుంటుంది.
ప్రభుత్వ పరిశ్రమలలో సొంత ప్రతిభ లేని మేనేజరు ప్రక్క డిపార్ట్మెంటు మెనేజర్  మీదకి తన వైఫల్యాలని నెట్టి తన పనితీరు బాగుందని మెప్పు పొందినట్లుగా ప్రవర్తిస్తాడు . ఈ రోజుకీరోజు సీ సీ టీ వీ లు అమర్చకపోవటం  పీడబ్ల్యూడి  శాఖ  పని చెయ్యకపోవటమేనని ఆయన చెప్పటమే కాక ఆ శాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవటంలేదని అందుచేత పేలుళ్ళకి బాధ్యత వారిమీదకి తొసేసేరు. అంతేగాని ఆ పని జరిగేలా చూడటంలో తను పూర్తిగా విఫలం అయ్యాడని తెలుసుకో లేదు  వప్పుకోలేదు! అదీ చిదంబరం !”

“దోషులని వదలము అని చెపుతూ దాడులని  తీవ్రంగా ఖండించేరు గదా చిదంబరం గారు.”
“ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పలేదు అయనా, ప్రధాని ఆమాటలు .  దాడులు జరిగిన ప్రతిమాటూ  వాళ్ళు చెప్పేది అదే మాట .  కాని ఇంతవరకూ దోషులని ఎవరినీ పట్టుకోని దాడులకి లెక్కలేదు .  దొరికిన ద్రోహులని కూడా శిక్షించకుండా, ఎవరో ఓట్లు వెయ్యరేమో అన్న భ్రమలో, తాత్సారం చేస్తూ ఆ ఉగ్రవాదులని ఇంటి అల్లుళ్ళలాగా  వాళ్ళ గొంతెమ్మ కోరికలు కూడా తీరుస్తూ ఉండటంలో మన దేశ ప్రభుత్వం యొక్క బలహీనతనీ, అలసత్వాన్ని ప్రపంచం  అంతటికీ చాటుతున్నప్పుడు మనదేశం అంటే ఎవరికి గౌరవం,   భయమూ ఉంటాయి!  అందు చేతనే తరచుగా ఈ దాడులు!
“అంతే కాదు, మౌఢ్యం కరుడుకట్టిన మతఛాందస దేశాధినేతలో/వ్యక్తులో కొందరు కావించే మారణ హోమానికి ఇస్లామిక్ ఉగ్రవాదం అనిపేరు పెట్టి వ్యవహరించే అమెరికన్ ఆలోచనా సరిళికి దాసోహం అయి, ఉగ్రవాదానికి ఆ మతానుయాయులందరూ కారణం అనేంతటి స్థితికి దిగజారిన రాజకీయం ఎంతటి హేయమైనది?  ఆ మతానికి చెందిన మన దేశ ప్రజలందరినీ అల్పులుగా పరిగణిస్తూ వారిని  అవమానిస్తున్నట్లుగా వాళ్ళని ఓటు బేంక్ గా జమకట్టి, మరెవరో మతితప్పిన వ్యక్తులు చేసిన తప్పిదం గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ ఉగ్రవాదం అన్న పేరును పెట్టి వ్యవహారంలో కి తీసుకొద్దామన్న  ప్రయత్నం చేసే  మన మంత్రి మంత్రిగారు హిందువులకే కాదు ముస్లీం సొదరులకీ మొత్తం దేశానికే తీరని ద్ర్రోహం చేస్తున్నారు!  ఎన్నికలలో గెలుపుకోసం, పదవులకోసం  రాజకీయ నాయకులు విడతీద్దామనుకున్నంతగా రెండుమతాల సామాన్య జనులు ఎవ్వరూ విడిపోలేదని నా ప్రగాఢవిశ్వాసం!  రెచ్చగొట్టబడినప్పుడు తాత్కాలికంగా  గీత దాటి ప్రవర్తించటం ‘మూక మనస్తత్వం’ .  దానికి మతంతో ప్రమేయం లేదు .  ఇస్లామిక్ ఉగ్రవాదం అంటే హిందువులు సంతోషిస్తారని, హిందూ ఉగ్రవాదం అంటే ముస్లీములు సంతోషిస్తారనీ అనుకొవటం కేవలం ఆనాయకుల అల్పబుధ్ధిని బయటపెట్టుకోవటమే అవుతుంది!”
అవునేమోనన్న అనుమానం నాకూ కలిగిన మాట వాస్తవం. అందుచేత నేను నోరు విప్పాల్సిన అవసరం నాకు కనపడ లేదు.
“అల్లాంటి నేతల మాటలు విని నీకు ధైర్యం కలగటం నీ గొప్పతనం. నీ లాంటి గొప్పవాళ్ళు ఎంత మంది ఈ దేశంలో వున్నారో అని నా విచారం .
“వాళ్ళని భగవంతుడే కాపాడాలి !”

నేనూ తీవ్రంగా అలోచించవలసిన విషయమేనేమో ఇది !!

Tuesday, September 6, 2011

దూసుకుపోతున్న N-TV, వెనుక పడుతున్న TV-9

టెలివిజన్ ఛానళ్ళ 'ప్రతిభకు' గీటురాయిగా చెప్పుకునే Television Audience Measurement (TAM) రేటింగ్ లో నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV అగ్రస్థానంలో దూసుకుపోతున్నది...బై వీక్లీ (హైదరాబాద్) లెక్క ప్రకారం.  ఏకఛత్రాధిపత్యం పొంది మెరుగైన సమాజం కోసం అహరహం పాటుపడుతున్న చానల్ TV-9 అనూహ్యంగా మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానాన్ని చెరుకూరి రామోజీ రావు గారి ఈ-టీ వీ ఆక్రమించగా, చాలా కాలంగా ఎవ్వరికీ అర్థంకాకుండా రెండో స్థానంలో ఉన్న TV-5 ఐదో స్థానానికి దిగజారిపోయింది. 

జగన్ భజన, కాంగ్రెస్ వ్యతిరేకత మినహా మరేదీ జర్నలిజం కాదని నమ్ముతున్న సాక్షి ఛానల్ TV-5, T-News, Zee, I-News, HM TV లను తలదన్నడం విశేషం. వేమూరి రాధాకృష్ణ గారి ABN-Andhra Jyothi పదో స్థానాన్ని ఆక్రమించగా, రామచంద్ర మూర్తి గారి సారధ్యంలోని HM TV తొమ్మిదో రాంకు పొందింది. 

ఈ లెక్కలు నిజంకాదు....టాం ఒక కాకి లెక్కల వ్యవహారం....ఈ తెగ బలిసిన యజమానులు రేటింగ్స్ ను టాంపర్ చేస్తారు...వంటి విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఈ రేటింగ్స్ ను బట్టి చానెల్ వాళ్లకు యాడ్స్ వస్తున్నాయా...అని నేను అడిగితె ఎవ్వరూ సరిగా సమాధానం ఇవ్వడంలేదు. TV-9  ను తెలంగాణలో కొన్ని చోట్ల రానివ్వకపోవడం వల్ల లెక్కలు మారాయేమో కూడా తెలియదు. 
మొత్తానికి ఇక ఆ లెక్కలు ఇలా వున్నాయి.
N-TV: 4.82
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42

Saturday, September 3, 2011

child labour




అనేకానేక సంక్షోభాలు
జీవితాన్ని కుదిపేశాక
బ్రతకటమనేదే ఆఖరి సమస్య
ఎవరికి ఎవరు ఏమీ కానప్పుడు
సొంత రక్తంలో పరాయితనం....

చెత్త కుప్పల మీద పరచుకున్న
శాపగ్రస్త బాల్యం street children
జీవితాన్ని వెతుక్కోవడానికి
సూర్యోదయానికి సలాం కొట్టి
వాళ్ళు బయల్దేరుతారు
భుజం మీద సంచిలో
బ్రతుకు భారాన్ని మోస్తూ

అక్షరాలు దిద్దాల్సిన బాల్యం
చిత్తు కాగితాల్లో చిక్కు పడిపోయింది
పాలు తాగాల్సిన బాల్యం
పాల కవర్ల వేటలో చేజారిపోయింది

ఏ అమావాస్య వాళ్ళను
వీధిపాలు చేసిందో ?
ఎండా...వాన...
ఏ  ఋతువైతేనేం?
పగలు ...రాత్రి ...
సమయంతో  సంబంధమేమీ లేదు
ఎవరున్నారు అడగడానికి

కేవలం బ్రతకడానికి
ఎన్నెన్ని యుద్దాలు చేస్తారు వాళ్ళు
ఎన్నిసార్లు గాయ పడతారో తెలుసా?
చేత్తకుప్పల్లో దొరికే వాటిని తీసి
అపురూపంగా సంచిలో వేసుకునే
వాళ్ళను చూస్తుంటే
పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు
వాళ్ళు నడుస్తుంటే
ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది

Search This Blog