Wednesday, October 26, 2011

దీపావళి


నిజమైన దీపావళి

బాలప్రభ
బాలలూ..దీపావళి పండుగ ఎపðడెపðడొస్తుందా.. బోలెడన్ని టపాసులు కాలుస్తామా ఆని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కదూ! దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. అన్ని వయసుల వారు ఆనందోత్సాహాలతో ఆడిపాడుతూ చేసుకుంటారు ఈ పండుగను. ఈ పండుగను అన్ని వయ సులవారు (చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా) ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.
దీపావళి వచ్చిందంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, టపాకాయలు (క్రాకర్స్‌) కాల్చడం వరకే చాలామంది పిల్లలకు తెలుసు. కానీ దీపావళి పండుగ ఎలావచ్చింది, దాని ప్రాముఖ్యత ఏమిటన్న విషయాన్ని మనమిపðడు తెలుసుకుందాం.
దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. దీనికి సంబం ధించి కొన్ని కథలు, ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండుగ గురించి గమనిస్తే, ఈ పండుగ విశిష్ఠత తెలు స్తుంది.
ఒకానొక యుగంలో నరకాసురుడనే రాక్షసుదు మొత్తం సృష్ఠిపై అధిపత్యం కోసం యుద్ధం చేసేవాడు. పరమాత్ముడు నరకాసురుని సంహరించి సృష్టికి నరకుని భయం నుండి విముక్తి కల్పించాడు. దేవతలను కూడా నరకాసురుని బంధనం నుండి విడిపించాడు.
ఈ కథ ఆధారంగానే దీపావళి పండుగకి ముందు రాత్రిని 'నరక చతుర్దశి' పేరిట మనమందరమూ జరుపు కుంటున్నాం. దీనికి మరోపేరు 'చిన్న దీపావళి'. తదనం తరం కార్తీక అమావాస్యను పెద్ద దీపావళిగా పేర్కొంటూ మహౌత్సాహంతో జరుపుకుంటారు.
మరో కథనం ప్రకారం దైత్యుల రాజైన బలి మొత్తం సమస్త భూమండలాన్ని ఏకచత్రాధిపతిగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ కాలంలోనే భూమిపై రాక్షసత్వం ప్రబల సాగింది. ధర్మ, నియమ,నిష్ఠలు వక్రమార్గం పట్టాయి. ఇదే క్రమంలో రాజాబలి శ్రీలక్ష్మిని, దేవ దేవతలను సయితం తన కారాగారంలో బంధించాడు.
ఈ విషయం తెలుసుకున్న పరమాత్ముడు రాజాబలి వంటి అసురశక్తిపై విజయం సాధించి కారాగారంలో చిత్రహింస అనుభవస్తున్న శ్రీలక్ష్మి ఇతరదేవతలకు విముక్తి కల్పించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా రాత్రి దీపోత్సవము జరుపుకుంటారని ప్రతీతి. ఈ పండు గనాడు ఇంటిముంగిట కల్లాపిజల్లి, రంగవల్లులు అద్ది, అందంగా అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరిచి శ్రీలక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
ఈ విభిన్న కథనాలను పరిశీలిస్తే, జ్ఞానులు దీనిని నరకాసుర మాయగా పేర్కొంటారు. కామ,క్రోద, వెూహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలుగా పేర్కొంటూ, అలాంటి అసుర లక్షణాలపై విజయం సాధించడానికి సంకేతంగా ఈ పండుగను జరుపు కుంటారని చెబుతారు.
గీతాసారంలో మరో అర్థం చెప్పబడింది. కలియుగ అంతం సమయంలో స్త్రీ,పురుషులు ఇలాంటి వికారాలకు గురవుతారని, అపðడు ఈ సృష్టి నరకంగా మారుతుందని, పరమాత్మ వికారాల రూపంలో ఉన్న నరకాసురుని అంతం చేశాడని చెబుతారు.
మరోకథనం ప్రకారం దీపావళి పండుగను రాముడు రావణునిపై విజయం సాధించిన దానికి ప్రతీకగా జరుపు కుంటారని చెబుతారు. విజయం అనంతరం మాల్యాదయుక్త మైన రామరాజ్యం ప్రారంభస్మరణ ఉత్సవంగా జరుపుకుం టారు. రావణుడు అసుర శక్తి కాగా రాముడు ఈశ్వరీయశక్తి గా పేర్కొంటారు.
దంతేదస్‌:
చిన్నదీపావళి, పెద్ద దీపావళి ఈ రెండింటి కంటే ముందువచ్చే చీకటి రాత్రినే 'దంతేదస్‌' అంటారు. ఈ పండుగ దినాన దీపదానం చేయడం ప్రత్యేకత. ఎవరైతే దీప దానం చేస్తారో వారు అకాలమృత్యువునుండి రక్షింపబడతారని, దీపదానం చేయడమంటే జ్ఞానదానం చేయడమేనంటారు.
మట్టితో చేసినదీపాలను దానం చేయడం శ్రేయస్కరం.
నేడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, స్వార్థం, అసూయ, ఈర్ష్యలతో జీవితాలను నరకంగా మార్చుకొని, ప్రజలు గాడాంధకారంలో,పేదరికంలో జీవిస్తున్నారు. అందుకే ప్రజలకు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు ప్రయత్నం చేయడం ద్వారా మాన వాళిని జ్ఞానమార్గం వైపు నడిపించవచ్చు.
ఈ పండుగ వెనుక ఉన్న కథనాలలోని పరమార్థం అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించడంగా చెబు తారు.
పిల్లలూ.. దీపావళి పండుగ గురించి తెలుసుకున్నారు కదా! ఈ పండుగనాడు మీరు టపాసులను కాల్చేటపðడు జాగ్రత్తగా ఉంటూ ఈ పండుగను జరుపుకోవాలి సుమా!

Friday, October 21, 2011

పాత పత్రికలు పాత పత్రికలు పాత పత్రికలు పాత పత్రికలు












గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు.జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది.

FACEBOOK USERS BEALERT


Monday, October 17, 2011

స్టీవ్ జాబ్స్ ఇక లేరు


స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు.
 ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు
హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి,
 బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న
విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం
 చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న
ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.
steve_jobs
నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ.
 అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా.
ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా
నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ
 మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే.
 అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం.
 ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని
 కారణాలలో మొదటిది ఏమిటంటే..
.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి,

అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో
అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.
ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా,
ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా,
నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం
ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు,
 కలలు కనండి,
 కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం
 స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే
ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ,
సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.
వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట)
ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు.
ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా
 వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ
ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం
 చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల
విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.
నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు.
 అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు.
 అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.
దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి
 అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు.
వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ
 కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి.
అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత
 స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే,
 IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో
ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న
 ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే,
IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ
పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.
అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే
 స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది
ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే
మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత
స్థాయిలో జరగలేదు.
కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్
 అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత
వ్యాపారం తోడైంది.
ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి
 అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి
(అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా
ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా
 ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే person  ఇకలేదు.
 ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి .

Sunday, October 2, 2011

ఆన్‌లైన్‌లో ఆకాశవాణి

సంగీతం మన జీవితంలో ఒక భాగం. ఇది అందరూ ఒప్పుకునే సత్యం. అది శాస్ర్తియ సంగీతమైనా భక్తి సంగీతమైనా సినిమా పాటలైనా మనసును ఉల్లాసపరుస్తాయి అని ఒప్పుకోక తప్పదు. ఉదయం ఆరు గంటలకే భక్తి సంగీతంతో నిద్ర లేపే రేడియో లేదా ఆకాశవాణి భారతీయులందరికీ సుపరిచితమే. కొనే్నళ్ల క్రింద ఒక చెక్కపెట్టెలో నుండి మాటలు, పాటలు వస్తూంటే వింతగా చూసేవారు కాని నేడది చాలామందికి జీవితంలో ఒక భాగమై పోయింది. ఒక టేబిల్ మీద ఉండే పెద్ద రేడియో పెట్టె నేడు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ద్వారా కోట్లాది మందిని అనుక్షణం వెన్నంటే ఉంటుంది. పాటలు వింటూ పని చేసుకోవడం ఒక వ్యసనంలా మారిందని చెప్పవచ్చు. మధురమైన సంగీతంతో మనసును సేదతీర్చి ఆహ్లాదాన్ని ఇచ్చే మధుర మైన వ్యసనం ఇది. అందుకే ఈనాడు ప్రతీ మొబైల్ ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో తప్ప కుండా ఉంటుంది. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో ఎన్నో ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లు, ఇంటర్నెట్ రేడియోలు పెరిగిపోతున్నాయి అని చెప్పవచ్చు. విస్తృతంగా పెరిగిన అంతర్జాల వినియోగంతో కొందరు ఔత్సాహికులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త రేడియో ఛానళ్లు మొదలుపెడుతున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా మొబైల్ ద్వారా పాటలు వింటున్నారు చాలామంది. ఈ ఎఫ్‌ఎం రేడియోలు మన దేశంలోనే అందుబాటులో ఉన్నాయి కాని విశ్వవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులైన తెలుగువారు తమ కంప్యూటర్ ద్వారా వివిధ రేడియోల ద్వారా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది.
దేవరాగం విత్ భారతి, నేను ప్రతీక, ముద్దుగా గుడ్‌మార్నింగ్ చెప్పే సునయన, క్రిష్, ఫాహద్, బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్.. వీళ్లందరూ నాయకులు కారు, సినీ ప్రముఖులు కారు ఐనా ఈనాడు ఎంతోమందికి పరిచయం. రోజూ వీరి మాటను అందరూ వింటున్నారు. ఆనందిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు. ఎవరు వీళ్లు? తెలుగు ఎఫ్‌ఎం ఛానెల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ తమ మాటలతో, మధురమైన పాత కొత్త పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందుకే రోజురోజుకు రేడియో వినియోగం పెరిగిపోతోందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు చిన్నచిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా రేడియో ద్వారా మంచి పాటలను వినిపిస్తున్నారు. మరి హైదరాబాద్‌లో మాత్రమే వినగలిగే తెలుగు ఎఫ్‌ఎం ఛానెళ్లు రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్‌ఎం, రెయిన్‌బో ఎఫ్‌ఎం, వివిధభారతి మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఇక్కడ http:// www.voicevibes.net/ / వినొచ్చు. కానీ ఖర్చు లేదు. సభ్యత్వం తీసుకునే పని లేదు. ఇదేకాక తెలుగు పాటలు వినిపించే రేడియో ప్లేయర్లు లభించే సైట్లు కూడా బోలెడన్ని ఉన్నాయి.
తెలుగు వన్ వారు నిర్వహిస్తున్న http:// www.toucheradio.com/ లో అమెరికా, లండన్, ఇండియా, ఆస్ట్రేలియా సమయాల కనుగుణంగా రేడియో ఏర్పాటు చేయబడింది. ఇందులో ‘లైవ్ రేడియో’ కూడా ఉంది. అలాగే ToRi లో రేడియో పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇళయరాజా పాత పాటలు, కొత్త పాటలు మొదలైన పేర్లతో ఇతర ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నారు. ఈ మధ్యే మొదలైన మరో రేడియో మనసుతో (manasutho.com) .. ఈ రేడియోలో మధురమైన పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉంటారు అంతేకాక యుగళ గీతాలు, సోలో గీతాలు, ప్రేమగీతాలు అంటూ వివిధ విభాగాలు కూడా పొందుపరిచారు నిర్వాహకులు. మరో తెలుగు రేడియో (ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో మాత్రమే పని చేస్తుంది http:// livetvchann elsfree.in/teluguradio.htm ఇక్కఢ తెలుగుతోబాటు మరి కొన్ని భారతీయ భాషలలోని పాటలు వినే అవకాశం ఉంది. నెటిజనులలో బాగా ప్రాచుర్యం పొందిన మరో రేడియో http:// www.radiokhushi.com/ ఇందులో తెలుగు, హిందీ భాషలలో రేడియోలు ఉన్నాయి. తెలుగు విభాగంలో మీరు కోరిన పాటలు, హిట్ పాటలు, భక్తి సంగీతం, అభినందనలు మొదలైన వర్గాలుగా పాటలను అందిస్తున్నారు. తెలుగు పాటలను అందించే మరో రేడియో http:// www.telugufms.com/ ఇందులో రేడియో మాత్రమే కాక ప్రముఖ సంగీత దర్శకుల పాటలు కూడా అందిస్తున్నారు. ఇందులో ఇరవైకి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. మరో కొత్త రేడియో ఛానెల్ http:// radiojosh.com/ ఇందులో తెలుగు హిందీ పాటలు వినొచ్చు. ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాల అనుసంధానంతో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా.. అంతేకాకుండా రాగా, చిమట మ్యూజిక్ సైట్లలో కూడా తెలుగు పాటల ప్లేయర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంప్యూటర్ తెరిచేసి హాయిగా తెలుగు పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు చేసుకోండి.... akulaa raghavendra

Saturday, October 1, 2011

మీరు కంప్యూటర్ పురుగా?

మీరు కంప్యూటర్ పురుగా?




 
మీరు సదా కంప్యూటర్ గురించే ఆలోచిస్తూ, దాంతోనే పనిచేస్తూ దాని గురించే మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారా? అయతే మీరు కంప్యూటర్ పురుగా? ఔనా కాదా! మీరే తేల్చుకోండి.
ఏదైనా వస్తువును లెక్కపెట్టమంటే 1,2,3,4,5,6,7,8,9,0, A,B,C,D.. అని లెక్కిస్తున్నారా?
బస్ ఎప్పుడొస్తుందీ అంటే 16 బిట్ బస్సా? 32 బిట్ బస్సా, లేక 64 బిట్‌దా అని అడిగేస్తున్నారా?
పుస్తకం చదివేటప్పుడు నెక్ట్స్ బటన్ ఎక్కడా అని గానీ,Scrol bar ఎక్కడా అని గానీ వెదికేస్తున్నారా?
లిఫ్ట్‌లో మీరెళ్ళాల్సిన ఫ్లోర్ నెంబర్‌ను ఒకసారి కాకుండా రెండుసార్లు (డబుల్ క్లిక్) నొక్కేస్తున్నారా?
మీ ఐటి అడ్రస్ అడిగితే, ఈ-మెయిల్ అడ్రస్ చెప్పేస్తున్నారా?
మీ కలలెలా వస్తున్నారుూ అంటే, 16.7 మిలియన్ కలర్స్‌లో అనేస్తున్నారా?
స్వీట్ డ్రీమ్స్ అనేందుకు బదులు గుడ్‌నైట్.కామ్ అనో, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు డాట్ స్లీప్/ స్వీట్ డ్రీమ్స్ అనో అంటున్నారా?
అయతే జాగ్రత్త పడండి! మీరు పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనే సమాధానం చెబితే మీరొక ‘కంప్యూటర్ వర్మ్’ లేదా ‘కంప్యూటర్ పురుగు’ అన్నమాటే. కంప్యూటర్ అడక్షన్‌కిది ప్రతీక అన్నమాట. సో బీకేర్ ఫుల్!....




courtesy.....( THIS ARTICLE TAKING FROM ANDRABOOMI)..

Search This Blog