మనమూ – మన ఆదర్శాలూ సూపరంతే..!!

బహు విచిత్రమైన భావం ఈ ఆదర్శం
నీ ఆదర్శం నాకువికారం, నా ఆదర్శం నీకు వెటకారం
మన ఆదర్శాలన్నీ పొందవు అందరి అంగీకారం
కట్నము తీసుకోని వాడు కావాలనే అమ్మాయి
పెళ్ళికి అవసరమంటుంది వరుడి కులం
లంచము తీసుకోననే ఆదర్శవంతుడు
మామగారి దగ్గర  తీసుకుంటాడు కట్నం
సంక్రాంతికి అడుగుతాడు ‘బైక్’ అనే లంచం
కులవివక్షను వ్యతిరేకించిన పెద్దమనిషి
లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడలేడు
తన భార్యను సమానత్వ  దృష్టితో చూడలేడు.
స్త్రీలపై జరిగే అన్యాయాలపై పోరాడే  స్త్రీవాది
పురుషులపై జరిగే అన్యాయాలను పట్టించుకోదు
మైనారిటీల హక్కులు కోసం పోరాడే ఆదర్శవాదులు
మెజారిటీల హక్కులపై జరిగే దాడి పట్టించుకోరు
ఎందుకంటే …
ప్రతీ మనిషికీ ఉంటుంది ఒక పరిధి
ఆ పరిధిలో ప్రతీ మనిషికీ ఉంటుందో  అనుభవం
ఆ అనుభవం నిర్దేశిస్తుంది మనిషి ఆదర్శం.
ఇరువురి ఆదర్శాలు  అవ్వొచ్చు పరస్పర విరుద్దం
అవి సమాజములోని అసమానతల ఫలితం
యేది యేమైనా,  ఆదర్శం సమాజ నిర్మానానికి తప్పని అవసరం