Friday, January 28, 2011

YOGA

 
 
మార్జాలాసనం    :
 మార్జాలం అంటే పిల్లి. దాని ఆకారం వచ్చేలా ఈ ఆసనాన్ని వేయాలి. మోకాళ్లు, అరచేతుల మీద వంగి ఉండాలి. తలను కిందికి వంచాలి. ప్రయోజనం :
మధుమేహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పొత్తి కడుపు భాగాలు గట్టిపడతాయి.
ముఖ్యంగా మహిళలకు నాభి కింది భాగం సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గర్భవతులు కూడా ఈ ఆసనాన్ని యోగా నిపుణుల సలహాతో చేయవచ్చు. సులువుగా ప్రసవం అయ్యేందుకు మార్జాలాసనం తోడ్పడుతుంది.

Tuesday, January 25, 2011

YOGA

 
 
వృషభాసనం    :
వృషభం (ఎద్దు) ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. సుఖాసనంలో కూర్చున్నట్లే ఒక కాలు అటు, మరొక కాలు ఇటు మడిచి కూర్చోవాలి. రెండు చేతులను మోకాలిమడమ దగ్గర పెట్టుకోవాలి.
 ప్రయోజనం :
వృషభాసనం వేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నడుంనొప్పిని కూడా ఇది దరి చేరనీయదు. సుఖాసనం లాంటిదే. ప్రయోజనాల మాట అటుంచితే, కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది.

Friday, January 14, 2011

YOGA





 
గోముఖాసనం     :
ఆవు ఆకారంలో ఈ ఆసనం ఉంటుంది. ఫొటోలో ఉన్నట్లు కుడికాలును ఎడంవైపుకు.. ఎడం కాలును కుడివైపుకు మడవాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొచ్చి, ఇంటర్‌లాక్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. కొంతసేపయ్యాక వ్యతిరేక దిశలో రిపీట్ చేయాలి.
ప్రయోజనం :
అతిగా మూత్రం వెలువడేవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. నరాల నీరసాన్ని తగ్గించి, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అండకోశం అనవసర పెరుగుదలను ఆపుతుంది.

Thursday, January 13, 2011

YOGA







గరుడాసనం   :
శరీరాన్ని గరుడ పక్షి (గద్ద) ఆకారంలో ఉంచితే అది గరుడాసనం అవుతుంది. గద్ద ఎంత దూరం ప్రయాణించినా ఆయాసపడదు. ఆ లక్షణం మనకూ రావాలంటే ఈ ఆసనం వేయాలి. రెండు చేతులు, కాళ్లు మెలితిరిగినట్లు, పెనవేసుకున్నట్లు శరీరాన్ని ఉంచాలి. శ్వాసను బయటికి వదిలి సాధ్యమైనంత వరకు ఆపాలి. ఇదే ఆసనాన్ని తిరిగి రెండవకాలు, చేయితో చేయాలి.
 ప్రయోజనం :
నిల్చుని చేయడం వల్ల నడుము కింది భాగంలోని దోషాలు నయమవుతాయి. నడుంనొప్పి, స్లిప్ డిస్క్ దూరమవుతాయి. అండకోశం వృద్ధి చెందుతుంది. హెర్నియా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలసట, ఆయాసాలను దూరం చేస్తుంది.
You might also like:

Wednesday, January 12, 2011

YOGA



ఊష్ట్రాసనం  :
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.
ప్రయోజనం :
మనం చేసే రోజువారీ పనుల్లో ఎక్కువ సమయం ముందుకు వంగి చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలు దగ్గరై.. వాటి నడుమ ఉన్న గ్రంధులు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనంలో వెనక్కి వంగడం వల్ల రక్తప్రసరణ జరగని భాగాలు సర్దుకుంటాయి. మెడభాగం (సర్వికల్), నడుము మధ్య భాగం ( డోర్సల్) , నడుం కిందిభాగం (లంబార్) ఆరోగ్యంగా ఉంటాయి.

Tuesday, January 11, 2011

YOGA

 

 Mayurasana



మయూరాసనం   :
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.
ప్రయోజనం : 
ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. ఎంతో కాలం నుంచి వేధించే మలబద్ధకం అయినా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా దోషాలు తగ్గుతాయి.

Saturday, January 1, 2011

అన్నీ భాషలూ మనవే (సంస్కృతం నుండి ఆంగ్లము):

అన్నీ భాషలూ మనవే (సంస్కృతం నుండి ఆంగ్లము):

 

తెలుఁగు సంస్కృతం నుండి వచ్చిందంటారు కొందరు సద్భక్తిగల తెలుఁగు వారు. మూఁడుకి త్రయానికి సంబంధం నాకు అర్థం కాదు. తెలుఁగువాడికి పొఱుగింటి పుల్ల కూర రుచి కాబట్టి, ఇప్పటిలో ఆంగ్ల పదాలు వాడుతున్నట్టు, అప్పటిలో సంస్కృత పదాలు భారీగా దిగుమతి చేసుకున్నారు. రాజుల భాష పేదలు దిగుమతి చేసుకొని వారు రాజులనుకోవడం సహజం, అలానే తెలుఁగులో సంస్కృత పదాలు, పార్సీ పదాలు నేడు ఆంగ్ల పదాలు దొర్లడం చూస్తున్నాము.

ఏది ఏమైనా నేను నేర్చుకున్న ఆంగ్ల సంస్కృత పదాల సారూప్యతకు ఉదాహరణలు కొన్ని (ఒక డబ్భై ఇంచుమించుగా), చూసి ఆనందిచండి దొరల భాష మననుండి ఎత్తుకెళ్ళారని. మనమంటే మన డాకడనుండే తెల్లవన్నెవారని.
మనవి- వీటిలోనాధారాలు చూపించడం కష్టం. మీకు నచ్చితే ఒప్పుకోండి లేదంటే, ఓహో అనుకోండి.

be - భూ
this -ఇదమ్
is - అస్
he - అసౌ
she - అసౌ
same - సమ

father - పితృ
mother - మాతృ
brother - భ్రాతృ
divine (deo) - దేవ

duo - ద్వయ
trio - త్రయ
quad- చతుర్ధ
penta - పఞ్చ
hexa - షష్ఠ
septa (seven) - సప్త
octa (eight) - అష్ట
nova (nine) - నవ
dec- (ten) - దశ


hand - హస్త
nasal - నాస
dental - దన్త
foot (pod) - పాద tripod - త్రిపాద

cow - గో
serpent - సర్పమ్
eqqous - అశ్వస్

youth - యువత
meter - మాత్ర
new - నవ
now - న్యూన
virile - వీర
regal - రాజ
red - రుధిర
light - లఘు
agnostic - అజ్ఞాన
knowledge - జ్ఞాన
greed - గృధ్
hirsute - హృష్యతి
direct - దిశ
varnish - వర్ణ
mortal - మృత్యు
anoint - అఞ్జన
post - పశ్చాత్

vehicle - వాహన
arrow - ఆసుః
yoke - యోగ
geo - గో
polis - పురస్
tree - తరు
helio- హోళి
naval - నావ
path - పథ

sit - అస్ (ఆసన)
bear - భర్ (భరించు)
go - గమ్
fall - పత్
stand - స్థాన్
specta- (inspect, respect, spectator) - స్పష్ట
gene (generation, generate, genes) - జన

alexios - రాక్షస్ (as in alex+andros - defender of men; రక్ష - defence)
dolphin - గర్భ
sib (gossip) - సభా
whole - సర్వ

కడనున్న నాలుగిటికీ కాస్త కథ వుంది, చూడగానే సంబంధం కానరాదు.

English - అంగ (England అంటే అంగదేశమని అంటే మన అస్సామని)
అంగ మనగా అవయవము, సన్నగా నుండునది. నేటి డేన్మార్కులోని ఒక సన్నట్టి నదీ కోన ప్రదేశం నుండి వెడలి వచ్చారు కాబట్టి వారిని ఆంగ్ల జనమని పేర్కొన్నారు.

ARTICLES






 డబ్బు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే ఆ సోదిలే అనుకునేదాన్ని. కాని పెరుగుతున్న బాధ్యతలు, అవసరాలు, చుట్టూ వున్నవాళ్ళతో పోలికలు, కనిపిస్తున్న అసమానతలు, హంగులు, ఆర్భాటాలు అలోచించేలా, ఆశ పుట్టేలా చేస్తాయి. డబ్బు నిజంగానే గౌరవం తెస్తుంది. అస్సలు మనం ఎదుటి వళ్ళకి ఏ మాత్రం విలువ, పాడు ఇవ్వకపోయినా వాళ్ళు మాత్రం మనకి విలువ ఇచేలా చేసేస్తుంది అదేంటో వింతగా. అలా అని కక్కుర్తిపడి డబ్బు కోసం ఎవరి దగ్గరన్న చేయి చాస్తే, తేరగా వచ్చేదాని కోసం ఆశ పడితే అసలు మన విలువే పోయేలా చేస్తుంది.డబ్బు అనేది చాలా విషయాల్ని మార్చగలదు. మనుషుల్ని ఆడించగలదు.

నిజంగా అది పుట్టించే ఆశ వుంది చూసారు మహా డేంజరస్. అందుకే డబ్బు విలువ గుర్తించాలి. డబ్బుని ప్రేమించాలి, గౌరవించాలి. ఓపికుంటె కష్టపడి తెలివిగా సంపాదించాలి. లేదంటే వున్నదాంతో బిందాస్గా గడిపెయ్యాలి. అందులో కొంతైనా అక్కర్లేని హంగులకి పోకుందా, అవసరమైన వాళ్ళకిచ్చి దాని విలువ పెంచాలి. "కాని దానికి బానిస మాత్రం కాకూడడు" . ఇదీ నేను నేర్చుకున్న పాఠం.అందుకేమనం కనీసం కొన్ని సార్లు అయీనాబీద బిక్కి కి సయం చేయాలి అప్పుడే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది .ఇది రఘు పాటించేది .రండి మీరు చేయి కలపండి మా sasm trust & INSPIRE VOLUNTARY  ORGANISATION తో .ఉంటా మరి మీ రాఘవేంద్ర .

Search This Blog