Thursday, June 23, 2011

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం:

 

 

 

 

(ఏదో ఒక సారి రెండు సార్లు ధరలు పెంచితే స్పందించి పోస్ట్ రాస్తాం కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంటే ఎన్ని పోస్టులని మాత్రం రాస్తాం చెప్పండి? ఇప్పుడు గ్యాస్, డీజిల్ ధరలు పెంచి 'జనాలు భరించగలరు' అన్న మంత్రిగారి ఉవాచ చూసి ఈ మాట ఎక్కడో విన్నానే అని పాత పోస్టులు తిరగేస్తే ఇదిగో ఈ పోస్ట్ కనిపించింది. చిత్రంగా ఈ పోస్ట్ గత ఏడాది ఇదే రోజు రాసినది. అప్పటికీ ఇప్పటికీ పెట్రోలియం శాఖా మంత్రి మారారు గానీ వాళ్ళు చెప్పే మాట మారకపోవడం విచిత్రం. అవును మరి మన మంత్రులంతా ఒకే మాట మీద ఉండటం మన ప్రజాస్వామ్యానికి గౌరవం కాదూ. వాళ్ళే మాట మార్చనప్పుడు నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే. )

"ప్రజలు భరించగలిగే స్థాయిలోనే పెట్రో ధరలు పెంచాం" - కేంద్రం 

టివి లో ఈ స్టేట్మెంట్ చూసి బోల్డంత హాశ్చర్యం వేసేసింది. అసలు ప్రజలు ఎంతవరకూ భరించగలరో వీళ్ళకి ఎలా తెలుసా అని? తరవాత గుర్తొచ్చింది మన దేశం లో ఏ విషయాన్నయినా, ఎంతవరకయినా భరించడమే తప్ప అదేంటని ప్రశ్నించడం మనకెప్పుడూ అలవాటు లేదని. నిజమే స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం. మనం ఎన్నుకున్న నాయకులు తాము చేసిన వాగ్దానాలు మరచి సొంత లాభం కోసం అడ్డమయిన గడ్డీ కరుస్తుంటే మౌనంగా భరిస్తాం. మన ఖర్మ అని సరిపెట్టుకుంటాం. అవును మరి అందరూ దొంగలే అయినప్పుడు వాడికన్నా వీడు కాస్త మంచి దొంగ అని సరిపెట్టుకోవాల్సిందే కదా! 

సరే ఇంక పెట్రోలు విషయానికి వస్తే...చమురు ధరలపై నియంత్రణ ఎత్తేశాం అని కేంద్రం ఘనంగా ప్రకటించింది, అక్కడికేదో ఇప్పుడు అన్నిటి మీదా నియంత్రణ ఉన్నట్టు. జనం జేబుకు చిల్లు పడ్డా పర్లేదు కానీ చమురు కంపెనీలు మాత్రం చల్లగుండాలి ఇదీ మన కేంద్ర విధానం. పైగా నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోలు రేట్లు పెరగచ్చు కనక కానీ రేట్లు తగ్గితే పెట్రోలు రేట్లు మంచినీళ్ళ కన్నా చీప్ అయిపోతాయి( మన ఖర్మ చివరికి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది), ఎక్కువమంది పెట్టుబడి దారులు ఈ రంగం లోకి వచ్చి పోటీ పెరిగి ధరలు తగ్గిపోతాయి అని ఒక వింత వాదన. అందుకు టెలికం రంగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు  అమ్మగారి అడుగులకు మడుగులోత్తే అమాయక నేతలు. సాంకేతికత తో ముడిపడ్డ రంగానికి, సహజ వనరులతో ముడిపడ్డ రంగానికి సామ్యం తేవడం వీరికే చెల్లింది. అసలు చమురు కంపెనీల మీద వడ్డిస్తున్న పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా చమురు ధరలూ తగ్గుతాయిగా...అమ్మమ్మ ఎంత మాట? అలాంటి వాటిమీద పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే అసలు అనకూడని, వినకూడని మాట. అయినా ఎంత పెంచినా అన్నీ మూస్కుని భరించడానికి జనం ఉండగా పన్నులు తగ్గించి మన ఖజానా బరువెందుకు తగ్గించుకోవాలని పాపం వాళ్ళ ఆలోచన. అదీ నిజమే లెండి భరించడం మన జన్మ హక్కు మరి. అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే  మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో :) 

ఇక మొదలవుతుంది అసలు కధ, ఒక్క పెట్రోలు, డీజిల్ రేట్లతోనే ఈ కధ ఆగుతుందా? నిత్యావసరాల దగ్గర నుంచీ ప్రతీ వస్తువు ధారా ఈ సాకుతో అమాంతం పెరిగిపోతుంది. అయినా మనం చిరునవ్వులు చిందిద్దాం. 

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం 

Wednesday, June 22, 2011

ర్యాగింగ్‌ను నివారిద్దాం : ఆకుల రాఘవేంద్ర

- ఇది ఓ హాస్టల్‌ జూనియర్‌ విద్యార్థిని ఆవేదన.
కాలేజిలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థికి 1000 గుంజీలు తీయాలని సీనియర్స్‌ ఆర్డర్‌..
తీస్తూ... తీస్తూ.. సృహతప్పి క్రింద పడిన వైనం.
- ఇది హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ఒక సంఘటన.
ఢిల్లీ నడివీధిలో వేగంగా పరుగెత్తుతున్న రైలుకిందపడి జీవితాన్ని చాలించుకున్న భాస్కర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పింది ర్యాగింగే. ఇవి కేవలం బయటపడ్డ సంఘటనలు మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్నో... ర్యాగింగ్‌ వికృత చేష్టలకు మానసిక, శారీరక హింసకు గురవుతున్నవారూ ఇప్పటికీ ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో ర్యాగింగ్‌ రక్కసి పడగవిప్పుతూనే వుంది. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో, ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కళాశాలల్లో ఇది ఎక్కువగా వుంది.
ర్యాగింగ్‌ విద్యార్థిలోకానికి ఒక ఆటంకంగా పరిణమిస్తోంది. ఉన్నత చదువులు చదుకోవాలన్న పలువురి ఆశలపై నీళ్లు జల్లుతోంది. బంగారు భవితను బుగ్గిపాలు జేస్తోంది. కాలేజీలో చేరిన విద్యార్థుల్ని అక్కడి వాతావరణానికి అలవాడు పడేందుకు పరిచయం అన్నది ఎంతో అవసరం. అయితే అది అందర్నీ సంతోషపెట్టే ఒక సరదా కార్యక్రమంగా ఉండాలే తప్ప ప్రాణాలు తీసే వికృత చేష్టలకు వేదిక కాకూడదు. కానీ నేడు ర్యాగింగ్‌కు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. పల్లె ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు, కొత్తగా కాలేజీలో చేరే అమ్మాయిలకు, ద్‌ీవషష్ట్ర, ఎషa, ఎba, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పాల్‌టెక్నిక్‌, నర్సింగ్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. అందుకే కాలేజీలో చేరిన తర్వాత అందరితో కలిసిపోవడానికి ఒక పరిచయ వేదిక అవసరం. జూనియర్లకు సీనియర్లు చక్కటి గైడెన్స్‌ ఇచ్చేలా ఉంటే అది బాగుంటుంది కానీ ర్యాగింగ్‌ పేరుతో ఏడ్పించడం, రకరకాలుగా హింసించడం, వారి జీవితాలకే ఎసరు పెట్టడం పైశాచికానందమే తప్ప మరొకటి కాదు. కళాశాల క్యాంపస్‌లో, హాస్టల్స్‌లో, స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్స్‌లో ర్యాగింగ్‌ ఎక్కువగా వుంటోంది. మహిళా కళాశాలల్లోనూ సీనియర్లు జూనియర్లను వేధించడం చూస్తున్నాం. అంటే ర్యాగింగ్‌ ఎక్కడున్నా అది అత్యంత ప్రమాదకారి అన్నది గుర్తుంచుకోవాలి.
ర్యాగింగ్‌ నివారణకు యుజిసి మార్గదర్శకాల్లో కొన్ని
1. కొత్తగా కళాశాలలో చేరే విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, ర్యాగింగ్‌ నియంత్రణ మండలి, వార్డెన్స్‌, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇవ్వడం తప్పనిసరి.
2. జూనియర్లు సీనియర్లతో కలిసి యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి, అందర్నీ భాగస్వామ్యం చేయాలి.
3. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే కేసు ఫైల్‌ చేయడానికి కాలేజీ యాజమాన్యం ముందుకు రావాలి. లేదంటే కళశాల గుర్తింపును రద్దు చేయాలి.
4. రాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థికి ఆ విద్యా సంవత్సరం పరీక్షలకు అనుమతించ కూడదు. మరే ఇతర కళశాలల్లో చేరకుండా సస్పెండ్‌ చేయాలి.
6. యాజమాన్యం... కళశాల్లో చేరే కొత్త విద్యార్థులతో, వారి తల్లి దండ్రులతో ర్యాగింగ్‌కు పాల్పకుండా లిఖిత పూర్వక హామీ పత్రాన్ని తీసుకోవాలి. హాస్టల్స్‌లో చేరే విద్యార్థులు విధిగా మరొక హామి పత్రం సమర్పించాలి.
ఈ మార్గదర్శకాలు ర్యాగింగ్‌ పాల్పడే విద్యార్థుల్ని, సంబంధిత కళాశాల యాజమాన్యాలను బాధ్యుల్ని చేస్తున్నాయి. ప్రస్తుతం వున్న యుజిసి మార్గదర్శకాలేగాక అవసరమైన కొత్త నిబంధనలు రూపొందించి,... వాటిని అమలు చేయాలి.
శిక్షలు వున్నాయి
మనదేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ర్యాగింగ్‌ ఎక్కువగా వుంది. సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను దేశవ్యాప్తంగా నిషేధించింది. డాక్టర్‌ రాఘవన్‌ కమిటీ సిపార్సులు, సూచనల మేరకు ర్యాగింగ్‌ అన్నది పూర్తిగా నిషేధం. పరిచయం పేరిట ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులవుతారు.
చట్ట పరిధిలోనే ర్యాగింగ్‌ నిరోధానికి కఠినంగా వ్యవహరించే అవకాశం వుంది. అయితే ఈ చర్యలన్నీ విద్యార్థుల్ని ఆలోచింపజేయాలి.
విద్యార్థులకు... సీనియర్లకు ఈ శిక్షల గురించి కళాశాలల యజమాన్యం వివరించి చెప్పాలి. ర్యాగింగ్‌కు పాల్పడితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 323,324,326,336,342,506 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌ నిరోధానికి ప్రత్యేకం చట్టం చేసింది. ర్యాగింగ్‌కు పాల్పడి వారికి మూడేళ్ల జైలుశిక్ష అమలు చేయాలని యుజిసి సిఫార్సు చేసింది. పైన పేర్కొన్న సెక్షన్లకింద ఏడాది జైలుశిక్ష, వెయ్యిరూపాయలు జరిమాన విధించవచ్చు.
రప్రమాదకర ఆయుధాలతో ర్యాగింగ్‌కు పాల్పడితే మూడేళ్ల కారగార శిక్ష... జరిమాన విధించాలి.
రమారణాయుధాలతో దాడిచేస్తే, ర్యాగింగ్‌ చేస్తే జీవితఖైదుగాని, పదేళ్ల కారాగారశిక్ష గాని విధించవచ్చు.
రఅసభ్య పదజాలంతో దూషించినా, భయోత్పాతానికి గురి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా జూనియర్లతో వెట్టి చాకిరీ చేయించినా, పదిమంది ముందు, క్లాస్‌లో అమ్మాయిల్ని ఏడ్పిండిచినా అలాంటి వారికి ఆ విద్యా సంవత్సరం రద్దు... జైలు శిక్ష తప్పదు.
అయితే ఈ చట్టంలో శిక్షలున్నాయిగానీ మానసిక పరివర్తనకు తగిన సూచనలు, శిక్షలు ఇంకా లేవనే చెప్పాలి. ఆ విధమైన చట్టం వస్తే ర్యాగింగ్‌ను పూర్తిగా నివారించవచ్చు.
తప్పు ఎవరిది?
కొన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు తమ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ జరిగినా పరువుపోతుందన్న ఉద్దేశంతో బయటకు పొక్కనివ్వట్లేదు. '' మీ చొక్క వెనక పడ్డ బురదను మేము చూడలేదన్నట్లు'' ప్రవర్తించడం, అది కేవలం పోలీసుల వ్యవహారం. మేము తలదూర్చం అన్నట్లుగా బాధ్యతా రాహిత్యంవల్లే ర్యాగింగ్‌ బాధితుల చిట్టా.. చాంతాడులాగా పెరుగుతోంది. ఇంకా కొన్ని కళాశాలలు ర్యాగింగ్‌ బాధితుల గురించి కనీసం వారి తల్లిదండ్రులకు కూడా తెలుపకపోవడం విడ్డూరం. ఇలాంటి కళాశాలల గుర్తింపు రద్ధు చేయాలి.
మీడియా... నేడు అన్ని రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది మీడియా. విద్యార్థులకు, నిరుద్యోగులకు బాసటగా అనేక విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల సమాచారం అందిస్తోంది. నోటిఫికేషన్లు, స్టడీ మెటీరియల్స్‌, ప్రముఖుల సలహాలు తదితర కార్యక్రమాలతో చక్కటి మార్గదర్శకాన్ని చూపుతోంది. ఇది నాణేనికి ఒకవైపు మరోవైపు కొన్ని పత్రికలు, చానెల్స్‌ రేటింగ్స్‌ కోసం పోటీపడి మరీ ర్యాగింగ్‌ బాధితుల్ని పదే పదే చూపడం, ర్యాగింగ్‌కు ఎలా పాల్పడుతున్నారనే దశ్యాలను చూపడం విద్యార్థుల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉంటున్నాయి. పరోక్షంగా ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. మీడి ఈ విషయంపట్ల జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలి. కళాశాలల్లో, పాఠశాల్లో, యూనివర్సిటిల్లో, కామన్‌సెన్స్‌ నేర్పరు. మన సంస్కృతి, మానవతా విలువలు. విద్యార్థుల లక్షణాలు, వ్యవహారశైలి అన్న అంశాలపై విడిగా ప్రతి సంవత్సరమూ ఒక సబ్జెక్టు వుండాలి. అప్పుడే విద్యార్థులు మానసికంగా పరిపూర్ణతచెంది ర్యాగింగ్‌ లాంటి వాటిని ప్రోత్సహించరు.
ఎన్ని చట్టాలున్నా... ఎన్ని మార్గదర్శకాలున్నా క్షేత్ర స్థాయిలో అవి బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. అందుకే కళాశాల స్థాయిలోనే దాన్ని నివారించే చర్యలు చేపట్టాలి.
*కాలేజీ యాజమాన్యం, అధ్యాపక బృందం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
* ప్రముఖులతో, విద్యావేత్తలతో, సైకాలజిస్టులతో అవగాహనా సదస్సులు నిర్వహించాలి.
*బాధ్యతగల విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి, ర్యాగింగ్‌ నిరోధానికి యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి.
*యాజమాన్యాలు విద్యార్థుల్ని క్యాంపస్‌లో నిరంతరం ఓ కంట కనిపెడుతుండాలి. హాస్టల్స్‌ అయితే (సి.సి. కెమరాలు) సీక్రెేట్‌ కెమరాలు వాడి నియంత్రిస్తూ వుండాలి.
*ర్యాగింగ్‌ వ్యతిరేక పోస్టర్లు లైబ్రరీలో, స్టోర్‌ రూములో, తరగతి గదులల్లో అతికించాలి.
*ర్యాగింగ్‌ వల్ల విద్యార్థులు ఏ విధంగా బాధపడాతారో, నష్టపోతారో కళాత్మక నాటకాలు, చిన్న నిడివి గల చిత్రాలు తీసి వాటిని ప్రదర్శించాలి.
రసీనియర్ల, జూనియర్ల మధ్య సంబంధాలు మెరుగు పడటంకోసం క్రికెట్‌ టోర్నమెంట్స్‌, ఆటల, పాటల పోటీలు నిర్వహించాలి. వీరిలో సోదర బావాన్ని పెంపొందించాలి. వెల్‌కమ్‌ పార్టీ, పేర్‌వెల్‌లు నిర్వహించాలి.ఈ విధంగా కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం చిత్తశుద్ధిగా సహకరిస్తే కామెంట్‌ కూడా కాంప్లిమెంట్‌ పరిమళం వెదజల్లుతుంది. ర్యాగింగ్‌ రక్కసిని నావారించగలుగుతాం.
ఆకుల రాఘవేంద్ర,
ఎంసిఎ,ఎమ్మెస్సీ సైకాలజీ,ఎంఎ ఇంగ్లీష్‌
సెల్‌ : 9985012181 

Tuesday, June 21, 2011



Free Education and Free hostel for Physically 
ChallengedHandicapped
children.Contact:- 9842062501 & 9894067506.


9985012181,9866915161








      contact: www.way2inspire.blogspot.com

Monday, June 13, 2011

పురోగమనంలో తిరోగమనం:

 

దూరదర్శిని - ప్రస్తుతం దర్శించయోగ్యం కానిదిగా మారిపోయింది. పెద్దలు కలాం  గారు చెప్పినట్టు అమ్మ చేతిలో అలంకృతమై కమ్మని వంటకు కారణం కావలసిన కత్తి హంతకుల చేతిలోనే ఉండిపోతుంది. నా చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికల్లా మా కాలనీలో ఒకే ఒక టీవీ ఉన్న ఇంటివైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళడం నాకింకా గుర్తుంది! కానీ ఇప్పుడు రూంలో ఎదురుగా ఉన్నా చూడలేని దౌర్భాగ్యం. మనసుకి ఉల్లాసం కలిగించే కార్యక్రమాలకు కాలం చెల్లపోయింది. ముఖ్యంగా గృహిణులపై (ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండే స్త్రీలు అని నా అభిప్రాయం) దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇక ప్రసారమయ్యే కార్యక్రమాల సంగతికి వస్తే వినోద సంబందమైనవి కొన్ని, వార్తా సంబందమైనవి కొన్ని. ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోడానికి. సినిమాల కన్నా టీవీలలో వస్తున్న సీరియల్స్ కే మంచి గిరాకీ ఉన్నట్టుంది. మేడిపండు చందాన పేర్లు మాత్రం బాగుంటున్నాయి. విషయం చూస్తే కేక్ కేక్. అనుబందాలు ఆత్మీయతలు ముడిపడ్డ ఇంట్లో జనమంతా కూర్చుని చూడలేని పాత్రల అల్లికలు. అదీ కాకుండా వీవెన్ గారు చెప్పినట్టు ప్రకటనల మద్యలో అప్పుడప్పుడూ కార్యక్రమాలాయె!

ఇక వార్తా చానళ్ళ విషయానికొస్తే నిరంతర వార్తా స్రవంతి అట! పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. ఎలాగోలా వల వేసి ఓ చిన్న చేపను పట్టుకోవడం; తమ గొప్పతనాన్ని చాటుకుంటూ (దీనినే ఢాంబికం అంటారు) ఓ రోజంతా ఆ విషయాన్నే వందసార్లు ప్రసారం చెయ్యడం నిజంగా రోత రోత. లేకపోతే సభల్లో మంత్రులు తిట్టుకోవడమో కొట్టుకోవడమో చూపిస్తారు.నేరాల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్నే కేటాయించారు. చదువరి గారు చెప్పినట్టు తింగరి లంగర్ల చేష్టలకు అంతలేకుండా పోతుంది.

ముఖ్యమైన విషయం మరచిపోయానండీ! ఈ మద్యన సినిమాల కన్నా టివీల వలన చాలా ప్రమాదం గోచరిస్తుంది. ఇది పిల్లలు కాదు పెద్దలు భయపడే విషయం. మనమెవరన్నా చిన్న పిల్లలను సినిమాలకు తీసుకెళ్ళాలంటే సదరు చిత్రంలో అశ్లీలమైనదేదైనా ఉన్నదో లేదో తెలుసుకుని నిర్ణయిస్తాం. కానీ టీవి చూస్తున్నప్పుడు అలా కుదరదు; ఎప్పుడో అకస్మాత్తుగా ఏ ఆంతరంగిక వస్తువు గురించి ప్రకటనో లేకపోతే ఏదైనా సినిమాలోని అసభ్య సన్నివేశమో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

- ఇక ఎడారిలో ఒయాసిస్సులా కొద్దో గొప్పో చూడాలనిపించే ఛానల్ ఒకటుందండోయ్! ఈటీవీ2 కొన్ని మంచి కార్యక్రమాలను అందిస్తుంది(ఇది నా అభిప్రాయం). (ఈటీవీ ఈ విషయంలో విలోమంలో ఉంటుంది).

- చివరగా ఎవరినన్నా నొప్పించి ఉంటే క్షమించండి.

Friday, June 10, 2011

నా/మా కింకా స్వతంత్ర్యం రాలేదు.

నా/మా కింకా స్వతంత్ర్యం రాలేదు.

 


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలైందని పేపర్లో చూస్తే అనిపించింది ... 
అబ్బా అప్పుడే 63 సంవత్సరాల ముసలిదైపోయిందా భారద్దేశం అని.

వ్యక్తి పుట్టిన నాటినుండి సుమారు 25 - 30 సంవత్సరాలవరకూ శారీరకంగా ఎదుగుతూ వుంటాడు. 

30 - 50 వరకూ ఎటువంటి ఎదుగుదలా కనిపించక పోయినా ఆతర్వాత మాత్రం తరుగుదల కనిపిస్తుంది. ఇదంతా మన కంటికి కనిపించేదే. కానీ మానసికంగా 16 - 18 సంవత్సరాల వరకూ శరవేగంగా అన్నిరంగాలలోనూ పెరిగే తెలివితేటలు ఆ తర్వాత అంత మోతాదులో కాకపోయినా దిశానుగుణంగా 
ఎంతో కొంత ఎదుగుదల 30 ఏళ్ళ వరకూ కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం సామాజిక స్పృహ 
పరంగా వుంటుది. ఆ తర్వాత 50 వరకూ ఎదుగుదల లేక పోయినా పరిధి విస్తృతమౌతుంది గమనించండి. ఇక పోతే 60 తర్వాత నుండీ దూరదృష్టి లేకపోవడం, కాలానుగుణంగా మారలేకపోవడం, 
తద్వారా సంకుచితత్వం, మూర్ఖత్వం ... ఇలా జీవితం సమసి పోతుంది.

మనిషి లాగానే దేశానికీ బాల్యం, యవ్వనం, వార్థక్యం లాంటి అవస్థలుంటాయా?


నా వరకూ వుంటాయనే అనుకుంటాను. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేసుకుంటూ... వ్యక్తి జీవితాన్ని దేశజీవనాన్ని అనుసంధానించండి. 

చాలా కొత్త విషయాలు (???) తెలుస్తాయి.


  • స్వాతంత్ర్యం అంటే ఏమిటి?
  • వ్యక్తి స్వాతంత్ర్యానికి దేశ స్వాతంత్ర్యానికి ఏమన్నా సంబంధం వుందా?
  • భావ స్వాతంత్ర్యం, వ్యక్తి స్వాతంత్ర్యాని కేవిధంగా భిన్నం?
  • ఎంత స్వాతంత్ర్యం సాధించామో తెలుసుకోవడానికేది కొలమానం?


  • మనిషికి స్వాతంత్ర్యం వస్తే ఏం చేస్తాడు? అసలేం చేయాలి?
  • మరి దేశానికి స్వాతంత్ర్యం వస్తే ...?
  • ఈ స్వాతంత్ర్యానికి లింగ భేదం వుంటుందా? అలాగే ప్రాంతీయతా భేదం, 
  • కుల మత భేదాలుంటాయా?


ఆలోచిస్తే అన్నీ ప్రశ్నలే ...


ప్రశ్నలేనిదే వికాసం వుండదంటారు


ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కొఱకు ప్రయత్నించండి ... 
అప్పుడర్థమౌతుంది మనమే మాత్రం స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామో!

మనిషి

మనిషి:

 

 

మనిషిలో కరువయింది మానవత్వమేనా,
మంచి, సహనం, సద్గుణం కూడా

తనచుట్టూ చేరినది మలినమొకటేనా,
ఆకలి, బాధ, భేషజాలు కూడా

తనను నడిపించేది ధనమొక్కటేనా,
గర్వం, అహంకారం, ద్వేషాలు కూడా

మనిషన్నది మంచి పంచేది లేదా,
పంచేది తనవద్ద వున్నప్పుడేగా

రాజవ్వు, పేదవ్వు ఎందుకీ భేదాలు,
కడతేరి చేరేది ఒకచోటికేగా

program katha

ఒక ప్రోగ్రాము కథ

అనగనగా ఒక కంప్యూటరు మేధావి. అతనికి ఎల్లప్పుడు తన దగ్గరున్న కంప్యూటరుతోనే కాలం గడిపేసేవాడంట. అయితే అతనికి తన కంప్యూటరులో ఉన్న ప్రోగ్రాములు ఎప్పుడూ యంత్రాలకు మళ్లే, మనం నడవమన్నప్పుడు నడవటం, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవడం చూస్తూ ఉండే వాడు. అవి వాటంతటవే జీవించగలిగేటట్లు చేస్తే ఎలా వుంటుందా అని ఎప్పుడూ కలలుగనే వాడు. కొన్ని సార్లు అతని కలల్లోకి, ఒక మగ ప్రోగ్రాము ఆడప్రోగ్రాము, వారి పిల్ల ప్రోగ్రామూ వచ్చేవి. ఇలా కొన్నిరోజులకు అతని కలల నిండా ఈ ప్రోగ్రాము కుటుంభమే కనిపిస్తూ ఉండేది.

ఒక శుభముహూర్తాన ఇలా కాదని జీవించగలిగే ఒక ప్రోగ్రామును సృష్టించాలని అనుకున్నాడు. జీవులలో ఉండే ముఖ్యలక్షణాలు ఏంటా అని అలాచిస్తే అతనికి వచ్చిన జాబితా ఇదీ:
1. సంతానాన్ని కలిగి తమ జాతిని అభివృద్ది పరచుకుంటాయి.
2. తమపై ఇతరుల దాడిని నుండి తమను తాము రక్షించుకోవాలని చూస్తాయి.
3. తమ ఉనికిని చాటే ఏదో ఒక లక్షణం కలిగి ఉండాలి.

ఇలా ఒక ప్రోగ్రామును రాసుకున్నాడు, దానికి అతను self-reproducing automaton అనే పేరుపెట్టుకున్నాడు. ఈ ప్రోగామును తన కంప్యూటరులో నడపడం మొదలు పెట్టాడు. అయితీ ఇది పరాన్న జీవిలా ఇప్పటెకే ఉన్న ప్రోగ్రాములపై ఆధారపడుతుంది. వాటిని మొదలుపెట్టినప్పుడు ఇవి కూడా మొదలవుతాయి, కానీ ఇవి మొదలైనటు ఎవరికీ తెలియదు! అలా ఈ ప్రోగ్రాము తన వంశాన్ని అభివృద్ది పరచుకోవడానికి ఒక అన్ని మాంలు ప్రోగ్రాములలోకీ తన సంతానాన్ని వ్యాపింప చేసింది. అలా వ్యాపిస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ తెలియకుండా అప్పటికే ఉన్న ప్రోగ్రాముల స్వభావాన్నికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేది. కానీ ప్రతీ ప్రోగ్రాములో ఈ ప్రోగ్రాము కలవటం వలన వాటి సైజు మాత్రం పెరిగి పోయేది, ఈ విధం దాని ఉనికిని పరోక్షంగా తెలిపుతూ ఉండేది.

ఇలా ఈ ప్రోగ్రామును ఒక పెంపుడు జీవిలా సాకుతూ ఉండే వాడు. దానిని అభివృద్ది పరచటానికి రోజూ కొత్త ప్రోగ్రాములను తన కంప్యూటరులో స్థాపించేవాడు. మన ప్రోగ్రామేమో వాటిలోకి కూడా వ్యాపించేసి దిన దిన ప్రవర్ధమానం చెందేది. అయితే కొన్ని రోజులకు తాను తయారు చేసిన ఈ ప్రోగ్రాము ఏమేమి చేయగలదో అందరికీ చూపించాలని అనుకున్నాడు. ఉంట్టినే అందరినీ తన కంప్యూటరు వద్దకు తీసుకు వచ్చి చూపిస్తే పెద్దగా మజా ఉండదని, అతని కంప్యూటరుకు అనుసంధానమైన కంప్యూటర్లలోకి కూడా వ్యాపించగలగే సామర్ధ్యాన్ని కల్పించాడు. అలాగే ప్రోగ్రాము తన ఉనికిని బహిరంగంగా చాటుకునేటట్లు రూపొందించాడు.

అయితే అతని కంప్యూటరుకు అనుసంధానమై ఉన్న అతని మితృలు, తమ తమ కంప్యూటర్లలో ఈ ప్రోగ్రామును చూసేసరికి, అది చేసే పనులు నచ్చక దానిని తొలగించడానికి ప్రయత్నాలను మొదలు పెటారు. అంతేకాదు ప్రోగ్రాముకు "కంప్యూటరు వైరస్సు" అనే కొత్త బిరుదును తగిలించారు. ఇది వైరస్సు కాదు నేను పెంచుకుంటున్న ప్రోగ్రాము, అని అతను ఎంత చెప్పినా అతని మిత్రబృంధం పెద్దగా పట్టించుకోలేదు. ఆ రకంగా జీవించగలిగే లక్షణాలున్న ప్రోగ్రాములన్నీ చెడ్డవైపోయాయి. అవి కంప్యూటరుకు ఎటువంటి హానీ తలపెట్టక పోయినా కూడా, వాటిని చెడగొట్టే ప్రాగ్రాములుగా అభివర్ణించడం మొదలుపెట్టారు.

Saturday, June 4, 2011

inspire person

బాజా మోత... లక్షల దాత...:

 

మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే...(నీను కుడా వెళ్ళలేదు   బట్ వెళ్ళిన   నా ఫ్రెండ్ ఒకామె చెప్పినది) మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి)  ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.

1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.

Wednesday, June 1, 2011

లేదు ఏదీ, కానిది నాది:

లేదు ఏదీ, కానిది నాది:

లేదు ఏదీ, కానిది నాది

అందీ అందని ప్రతి ఆశా నాది,
అందక మానేనా నాది అన్నది;ఊరి నోట వచ్చు మాట ఏదీ,
ఆపగలదా నా రేపు అన్నది

లేదు ఏదీ, కానిది నాది

కాలము విలువ తెలిసినదానను,కాలముతో నే పరిగెడతాను;కలవర పడను,కలము వీడను,కలమేగా నా చెలిమి అన్నది

లేదు ఏదీ, కానిది నాది

నక్షత్రాలే కాంతులు జల్లగా,మబ్బులే రాగాలు తీయగా;
అబ్బురపరిచే ప్రక్రుతి అందం,
అందిచదా నాకు త్రుప్తి అన్నది

లేదు ఏదీ, కానిది నాది

మనస్సులో ఏదో కలత ఉందని,
ఆగిపోవునా నా పయనమన్నది;
సముద్రములోని నావ వలె,
ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది

లేదు ఏదీ, కానిది నాది

Search This Blog