Friday, April 15, 2011

INSPIRE-STORYS

ఈరోజు ఉదయాన్నే లేచిపోయా!

రేపు ఉదయాన్నే తప్పకుండా లేచి మొదలు పెట్టాల్సిందే...
ఎట్టి
పరిస్థితుల్లోనూ ఇంక దీన్ని ఆపకూడదు, ఏవిటి బొత్తిగా ఇంత బద్దకం
పెరిగిపోయింది అప్పట్లో ఎంతటి చలాకితనం ఉత్సాహం ఉండేవి నాలో అవన్నీ
ఏమైపోయాయి,ఇలాగైతే మున్ముందు ఇంకా కష్టం.ఇదే కనుక కొనసాగితే ఆరోగ్య
సమస్యలు కూడా వస్తాయి. ఏమైనాసరే మరల మునుపటి నేను నేనుగా మారవలసిందే ఇంక
రేపు ఉదయం లేచిపోయి పారిపోతున్నా! అచ్చు తప్పు తప్పు...పరిగెడుతున్నా అంటే
వడివడిగా నడిచేస్తానని ఇలా ఆరునెలల్లో అరవైసార్లు అనుకుని ఉంటాను. ఇలా
రాత్రి పడుకునేటప్పుడు అనుకోవడం ప్రొద్దున్నే బద్దకించడం అలవాటైన నాకు
నాశరీరం కూడా సహకరించడంతో వాకింగ్ షూ పాడై మూడురోజుల్లో కొత్తవి
కొనుక్కొని మొదలుపెడదాంకదా అనుకున్నది ఆరునెలలు పట్టిందన్నమాట.


ఇందులో గొప్పేముంది వెళితే ఆశ్చర్యపోవాలి కాని అంటారా! నిజమేనండి....కాని
ఈరోజు ఉదయాన్నే అయిదున్నరకి నేను లేచిపోయి తయారై కొత్త షూ వేసుకుని
పరిగెట్టేసానుగా అందుకే ఈ ఆనందం అన్నమాట.

ఏదో ఆరునెలల నడకనంతా కవర్ చేయాలి అన్న భావోద్రేకంలో పరుగు తీసానే కాని
రోజంతా కాళ్ళతో ఒకటే నొప్పి, ఇంటికివచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం
అనుకున్నాను కాని రాత్రి ఒకేసారి పడుకుందామని ఇలా రిఫ్రెష్ అయి మీతో
పంచుకుంటే కాస్త నొప్పి మరచిపోతానని ఆశన్నమాట.
ఏవండో...మరచిపోయాను ఈ నడక ఇకముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదూ! మీ ఆకుల రాఘవేంద్ర .......

Search This Blog