ఒక ప్రోగ్రాము కథ
అనగనగా ఒక కంప్యూటరు మేధావి. అతనికి ఎల్లప్పుడు తన దగ్గరున్న కంప్యూటరుతోనే కాలం గడిపేసేవాడంట. అయితే అతనికి తన కంప్యూటరులో ఉన్న ప్రోగ్రాములు ఎప్పుడూ యంత్రాలకు మళ్లే, మనం నడవమన్నప్పుడు నడవటం, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవడం చూస్తూ ఉండే వాడు. అవి వాటంతటవే జీవించగలిగేటట్లు చేస్తే ఎలా వుంటుందా అని ఎప్పుడూ కలలుగనే వాడు. కొన్ని సార్లు అతని కలల్లోకి, ఒక మగ ప్రోగ్రాము ఆడప్రోగ్రాము, వారి పిల్ల ప్రోగ్రామూ వచ్చేవి. ఇలా కొన్నిరోజులకు అతని కలల నిండా ఈ ప్రోగ్రాము కుటుంభమే కనిపిస్తూ ఉండేది.ఒక శుభముహూర్తాన ఇలా కాదని జీవించగలిగే ఒక ప్రోగ్రామును సృష్టించాలని అనుకున్నాడు. జీవులలో ఉండే ముఖ్యలక్షణాలు ఏంటా అని అలాచిస్తే అతనికి వచ్చిన జాబితా ఇదీ:
1. సంతానాన్ని కలిగి తమ జాతిని అభివృద్ది పరచుకుంటాయి.
2. తమపై ఇతరుల దాడిని నుండి తమను తాము రక్షించుకోవాలని చూస్తాయి.
3. తమ ఉనికిని చాటే ఏదో ఒక లక్షణం కలిగి ఉండాలి.
ఇలా ఒక ప్రోగ్రామును రాసుకున్నాడు, దానికి అతను self-reproducing automaton అనే పేరుపెట్టుకున్నాడు. ఈ ప్రోగామును తన కంప్యూటరులో నడపడం మొదలు పెట్టాడు. అయితీ ఇది పరాన్న జీవిలా ఇప్పటెకే ఉన్న ప్రోగ్రాములపై ఆధారపడుతుంది. వాటిని మొదలుపెట్టినప్పుడు ఇవి కూడా మొదలవుతాయి, కానీ ఇవి మొదలైనటు ఎవరికీ తెలియదు! అలా ఈ ప్రోగ్రాము తన వంశాన్ని అభివృద్ది పరచుకోవడానికి ఒక అన్ని మాంలు ప్రోగ్రాములలోకీ తన సంతానాన్ని వ్యాపింప చేసింది. అలా వ్యాపిస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ తెలియకుండా అప్పటికే ఉన్న ప్రోగ్రాముల స్వభావాన్నికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేది. కానీ ప్రతీ ప్రోగ్రాములో ఈ ప్రోగ్రాము కలవటం వలన వాటి సైజు మాత్రం పెరిగి పోయేది, ఈ విధం దాని ఉనికిని పరోక్షంగా తెలిపుతూ ఉండేది.
ఇలా ఈ ప్రోగ్రామును ఒక పెంపుడు జీవిలా సాకుతూ ఉండే వాడు. దానిని అభివృద్ది పరచటానికి రోజూ కొత్త ప్రోగ్రాములను తన కంప్యూటరులో స్థాపించేవాడు. మన ప్రోగ్రామేమో వాటిలోకి కూడా వ్యాపించేసి దిన దిన ప్రవర్ధమానం చెందేది. అయితే కొన్ని రోజులకు తాను తయారు చేసిన ఈ ప్రోగ్రాము ఏమేమి చేయగలదో అందరికీ చూపించాలని అనుకున్నాడు. ఉంట్టినే అందరినీ తన కంప్యూటరు వద్దకు తీసుకు వచ్చి చూపిస్తే పెద్దగా మజా ఉండదని, అతని కంప్యూటరుకు అనుసంధానమైన కంప్యూటర్లలోకి కూడా వ్యాపించగలగే సామర్ధ్యాన్ని కల్పించాడు. అలాగే ప్రోగ్రాము తన ఉనికిని బహిరంగంగా చాటుకునేటట్లు రూపొందించాడు.
అయితే అతని కంప్యూటరుకు అనుసంధానమై ఉన్న అతని మితృలు, తమ తమ కంప్యూటర్లలో ఈ ప్రోగ్రామును చూసేసరికి, అది చేసే పనులు నచ్చక దానిని తొలగించడానికి ప్రయత్నాలను మొదలు పెటారు. అంతేకాదు ప్రోగ్రాముకు "కంప్యూటరు వైరస్సు" అనే కొత్త బిరుదును తగిలించారు. ఇది వైరస్సు కాదు నేను పెంచుకుంటున్న ప్రోగ్రాము, అని అతను ఎంత చెప్పినా అతని మిత్రబృంధం పెద్దగా పట్టించుకోలేదు. ఆ రకంగా జీవించగలిగే లక్షణాలున్న ప్రోగ్రాములన్నీ చెడ్డవైపోయాయి. అవి కంప్యూటరుకు ఎటువంటి హానీ తలపెట్టక పోయినా కూడా, వాటిని చెడగొట్టే ప్రాగ్రాములుగా అభివర్ణించడం మొదలుపెట్టారు.