Wednesday, June 22, 2011

ర్యాగింగ్‌ను నివారిద్దాం : ఆకుల రాఘవేంద్ర

- ఇది ఓ హాస్టల్‌ జూనియర్‌ విద్యార్థిని ఆవేదన.
కాలేజిలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థికి 1000 గుంజీలు తీయాలని సీనియర్స్‌ ఆర్డర్‌..
తీస్తూ... తీస్తూ.. సృహతప్పి క్రింద పడిన వైనం.
- ఇది హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ఒక సంఘటన.
ఢిల్లీ నడివీధిలో వేగంగా పరుగెత్తుతున్న రైలుకిందపడి జీవితాన్ని చాలించుకున్న భాస్కర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పింది ర్యాగింగే. ఇవి కేవలం బయటపడ్డ సంఘటనలు మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్నో... ర్యాగింగ్‌ వికృత చేష్టలకు మానసిక, శారీరక హింసకు గురవుతున్నవారూ ఇప్పటికీ ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో ర్యాగింగ్‌ రక్కసి పడగవిప్పుతూనే వుంది. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో, ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కళాశాలల్లో ఇది ఎక్కువగా వుంది.
ర్యాగింగ్‌ విద్యార్థిలోకానికి ఒక ఆటంకంగా పరిణమిస్తోంది. ఉన్నత చదువులు చదుకోవాలన్న పలువురి ఆశలపై నీళ్లు జల్లుతోంది. బంగారు భవితను బుగ్గిపాలు జేస్తోంది. కాలేజీలో చేరిన విద్యార్థుల్ని అక్కడి వాతావరణానికి అలవాడు పడేందుకు పరిచయం అన్నది ఎంతో అవసరం. అయితే అది అందర్నీ సంతోషపెట్టే ఒక సరదా కార్యక్రమంగా ఉండాలే తప్ప ప్రాణాలు తీసే వికృత చేష్టలకు వేదిక కాకూడదు. కానీ నేడు ర్యాగింగ్‌కు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. పల్లె ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు, కొత్తగా కాలేజీలో చేరే అమ్మాయిలకు, ద్‌ీవషష్ట్ర, ఎషa, ఎba, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పాల్‌టెక్నిక్‌, నర్సింగ్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. అందుకే కాలేజీలో చేరిన తర్వాత అందరితో కలిసిపోవడానికి ఒక పరిచయ వేదిక అవసరం. జూనియర్లకు సీనియర్లు చక్కటి గైడెన్స్‌ ఇచ్చేలా ఉంటే అది బాగుంటుంది కానీ ర్యాగింగ్‌ పేరుతో ఏడ్పించడం, రకరకాలుగా హింసించడం, వారి జీవితాలకే ఎసరు పెట్టడం పైశాచికానందమే తప్ప మరొకటి కాదు. కళాశాల క్యాంపస్‌లో, హాస్టల్స్‌లో, స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్స్‌లో ర్యాగింగ్‌ ఎక్కువగా వుంటోంది. మహిళా కళాశాలల్లోనూ సీనియర్లు జూనియర్లను వేధించడం చూస్తున్నాం. అంటే ర్యాగింగ్‌ ఎక్కడున్నా అది అత్యంత ప్రమాదకారి అన్నది గుర్తుంచుకోవాలి.
ర్యాగింగ్‌ నివారణకు యుజిసి మార్గదర్శకాల్లో కొన్ని
1. కొత్తగా కళాశాలలో చేరే విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, ర్యాగింగ్‌ నియంత్రణ మండలి, వార్డెన్స్‌, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇవ్వడం తప్పనిసరి.
2. జూనియర్లు సీనియర్లతో కలిసి యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి, అందర్నీ భాగస్వామ్యం చేయాలి.
3. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే కేసు ఫైల్‌ చేయడానికి కాలేజీ యాజమాన్యం ముందుకు రావాలి. లేదంటే కళశాల గుర్తింపును రద్దు చేయాలి.
4. రాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థికి ఆ విద్యా సంవత్సరం పరీక్షలకు అనుమతించ కూడదు. మరే ఇతర కళశాలల్లో చేరకుండా సస్పెండ్‌ చేయాలి.
6. యాజమాన్యం... కళశాల్లో చేరే కొత్త విద్యార్థులతో, వారి తల్లి దండ్రులతో ర్యాగింగ్‌కు పాల్పకుండా లిఖిత పూర్వక హామీ పత్రాన్ని తీసుకోవాలి. హాస్టల్స్‌లో చేరే విద్యార్థులు విధిగా మరొక హామి పత్రం సమర్పించాలి.
ఈ మార్గదర్శకాలు ర్యాగింగ్‌ పాల్పడే విద్యార్థుల్ని, సంబంధిత కళాశాల యాజమాన్యాలను బాధ్యుల్ని చేస్తున్నాయి. ప్రస్తుతం వున్న యుజిసి మార్గదర్శకాలేగాక అవసరమైన కొత్త నిబంధనలు రూపొందించి,... వాటిని అమలు చేయాలి.
శిక్షలు వున్నాయి
మనదేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ర్యాగింగ్‌ ఎక్కువగా వుంది. సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను దేశవ్యాప్తంగా నిషేధించింది. డాక్టర్‌ రాఘవన్‌ కమిటీ సిపార్సులు, సూచనల మేరకు ర్యాగింగ్‌ అన్నది పూర్తిగా నిషేధం. పరిచయం పేరిట ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులవుతారు.
చట్ట పరిధిలోనే ర్యాగింగ్‌ నిరోధానికి కఠినంగా వ్యవహరించే అవకాశం వుంది. అయితే ఈ చర్యలన్నీ విద్యార్థుల్ని ఆలోచింపజేయాలి.
విద్యార్థులకు... సీనియర్లకు ఈ శిక్షల గురించి కళాశాలల యజమాన్యం వివరించి చెప్పాలి. ర్యాగింగ్‌కు పాల్పడితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 323,324,326,336,342,506 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌ నిరోధానికి ప్రత్యేకం చట్టం చేసింది. ర్యాగింగ్‌కు పాల్పడి వారికి మూడేళ్ల జైలుశిక్ష అమలు చేయాలని యుజిసి సిఫార్సు చేసింది. పైన పేర్కొన్న సెక్షన్లకింద ఏడాది జైలుశిక్ష, వెయ్యిరూపాయలు జరిమాన విధించవచ్చు.
రప్రమాదకర ఆయుధాలతో ర్యాగింగ్‌కు పాల్పడితే మూడేళ్ల కారగార శిక్ష... జరిమాన విధించాలి.
రమారణాయుధాలతో దాడిచేస్తే, ర్యాగింగ్‌ చేస్తే జీవితఖైదుగాని, పదేళ్ల కారాగారశిక్ష గాని విధించవచ్చు.
రఅసభ్య పదజాలంతో దూషించినా, భయోత్పాతానికి గురి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా జూనియర్లతో వెట్టి చాకిరీ చేయించినా, పదిమంది ముందు, క్లాస్‌లో అమ్మాయిల్ని ఏడ్పిండిచినా అలాంటి వారికి ఆ విద్యా సంవత్సరం రద్దు... జైలు శిక్ష తప్పదు.
అయితే ఈ చట్టంలో శిక్షలున్నాయిగానీ మానసిక పరివర్తనకు తగిన సూచనలు, శిక్షలు ఇంకా లేవనే చెప్పాలి. ఆ విధమైన చట్టం వస్తే ర్యాగింగ్‌ను పూర్తిగా నివారించవచ్చు.
తప్పు ఎవరిది?
కొన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు తమ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ జరిగినా పరువుపోతుందన్న ఉద్దేశంతో బయటకు పొక్కనివ్వట్లేదు. '' మీ చొక్క వెనక పడ్డ బురదను మేము చూడలేదన్నట్లు'' ప్రవర్తించడం, అది కేవలం పోలీసుల వ్యవహారం. మేము తలదూర్చం అన్నట్లుగా బాధ్యతా రాహిత్యంవల్లే ర్యాగింగ్‌ బాధితుల చిట్టా.. చాంతాడులాగా పెరుగుతోంది. ఇంకా కొన్ని కళాశాలలు ర్యాగింగ్‌ బాధితుల గురించి కనీసం వారి తల్లిదండ్రులకు కూడా తెలుపకపోవడం విడ్డూరం. ఇలాంటి కళాశాలల గుర్తింపు రద్ధు చేయాలి.
మీడియా... నేడు అన్ని రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది మీడియా. విద్యార్థులకు, నిరుద్యోగులకు బాసటగా అనేక విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల సమాచారం అందిస్తోంది. నోటిఫికేషన్లు, స్టడీ మెటీరియల్స్‌, ప్రముఖుల సలహాలు తదితర కార్యక్రమాలతో చక్కటి మార్గదర్శకాన్ని చూపుతోంది. ఇది నాణేనికి ఒకవైపు మరోవైపు కొన్ని పత్రికలు, చానెల్స్‌ రేటింగ్స్‌ కోసం పోటీపడి మరీ ర్యాగింగ్‌ బాధితుల్ని పదే పదే చూపడం, ర్యాగింగ్‌కు ఎలా పాల్పడుతున్నారనే దశ్యాలను చూపడం విద్యార్థుల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉంటున్నాయి. పరోక్షంగా ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. మీడి ఈ విషయంపట్ల జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలి. కళాశాలల్లో, పాఠశాల్లో, యూనివర్సిటిల్లో, కామన్‌సెన్స్‌ నేర్పరు. మన సంస్కృతి, మానవతా విలువలు. విద్యార్థుల లక్షణాలు, వ్యవహారశైలి అన్న అంశాలపై విడిగా ప్రతి సంవత్సరమూ ఒక సబ్జెక్టు వుండాలి. అప్పుడే విద్యార్థులు మానసికంగా పరిపూర్ణతచెంది ర్యాగింగ్‌ లాంటి వాటిని ప్రోత్సహించరు.
ఎన్ని చట్టాలున్నా... ఎన్ని మార్గదర్శకాలున్నా క్షేత్ర స్థాయిలో అవి బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. అందుకే కళాశాల స్థాయిలోనే దాన్ని నివారించే చర్యలు చేపట్టాలి.
*కాలేజీ యాజమాన్యం, అధ్యాపక బృందం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
* ప్రముఖులతో, విద్యావేత్తలతో, సైకాలజిస్టులతో అవగాహనా సదస్సులు నిర్వహించాలి.
*బాధ్యతగల విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి, ర్యాగింగ్‌ నిరోధానికి యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి.
*యాజమాన్యాలు విద్యార్థుల్ని క్యాంపస్‌లో నిరంతరం ఓ కంట కనిపెడుతుండాలి. హాస్టల్స్‌ అయితే (సి.సి. కెమరాలు) సీక్రెేట్‌ కెమరాలు వాడి నియంత్రిస్తూ వుండాలి.
*ర్యాగింగ్‌ వ్యతిరేక పోస్టర్లు లైబ్రరీలో, స్టోర్‌ రూములో, తరగతి గదులల్లో అతికించాలి.
*ర్యాగింగ్‌ వల్ల విద్యార్థులు ఏ విధంగా బాధపడాతారో, నష్టపోతారో కళాత్మక నాటకాలు, చిన్న నిడివి గల చిత్రాలు తీసి వాటిని ప్రదర్శించాలి.
రసీనియర్ల, జూనియర్ల మధ్య సంబంధాలు మెరుగు పడటంకోసం క్రికెట్‌ టోర్నమెంట్స్‌, ఆటల, పాటల పోటీలు నిర్వహించాలి. వీరిలో సోదర బావాన్ని పెంపొందించాలి. వెల్‌కమ్‌ పార్టీ, పేర్‌వెల్‌లు నిర్వహించాలి.ఈ విధంగా కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం చిత్తశుద్ధిగా సహకరిస్తే కామెంట్‌ కూడా కాంప్లిమెంట్‌ పరిమళం వెదజల్లుతుంది. ర్యాగింగ్‌ రక్కసిని నావారించగలుగుతాం.
ఆకుల రాఘవేంద్ర,
ఎంసిఎ,ఎమ్మెస్సీ సైకాలజీ,ఎంఎ ఇంగ్లీష్‌
సెల్‌ : 9985012181 

Search This Blog