Monday, August 1, 2011

arab sekk

అంతరిక్షానికి కనిపించే కీర్తి ప్రతిష్టలు


సరదా పడటం మనిషి సహజ లక్షణం. కాకపోతే.. జేబులో కాసుల మోతను బట్టి సరదా సందడి ఉంటుంది. పర్సులో 10 రూపాయలుంటే పార్క్‌ సరదా.. వంద నోటు చేతిలో ఉంటే సినిమా సరదా. మరి లక్షల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులుంటే... ఆ వ్యక్తి సరదాకు హద్దేముంటుంది చెప్పండి ? జుట్టున్నామె ఎన్ని కొప్పులైనా పెడుతుందన్నట్టుగా... డబ్బున్న మారాజు పోయే దర్పానికి..., ఆకాశం కూడా హద్దు కాదు. అందుకే అంతరిక్షంలోకీ తన పేరు కనిపించేలా ఓ అరబ్ షేక్ గారు తన పేరును ఈ భూమిపై రాయించుకున్నాడు..

ప్రపంచంలో తనకున్నన్ని కీర్తిప్రతిష్టలు మరెవరికీ ఉండకూడదన్నది దుబాయ్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన షేక్‌ హమద్‌కు మా చెడ్డ కోరిక. కాసులున్న మారాజు కళాపోషణ చేయాలనుకుంటే... క్రియేటివిటీ కొత్త పుంతలే కాదు... వింత పుంతలు కూడా తొక్కుతుందనడానికి హమిదే నిదర్శనం. ఏకంగా ఒక దీవినే కొనిపారేసి... దానిపై తన పేరును ఇంగ్లీష్‌లో రాయించాడు... కాదు కాదు... చెక్కించాడు‌. అకాశంలోనుంచి చూసినా... ఆ మాటకొస్తే... అంతరిక్షంలోంచి కూడా ఈ పేరు కనిపిస్తుంది.
అల్‌ ఫుటైసీ దీవిలో మూడు కిలోమీటర్ల వైశాల్యంలో తన పేరును చెక్కించాడు. ఒక్కో అక్షరం అర కిలోమీటర్‌ విస్తీర్ణంలో ఉంటుంది. స్పేస్‌ నుంచి చూసినా హమద్‌ అన్న పేరు అందంగా కనిపిస్తుంది. గుగూల్‌ ఎర్త్‌లో దీన్ని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. 63 ఏళ్ల షేక్‌ హమద్‌.. దుబాయ్‌ రాయల్‌ ఫ్యామిలీ వారసుడు. వరల్డ్‌ బిలియనీర్స్‌లో ఒకడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆకాశమంత కీర్తి ఎలాగూ ఉంది. అందుకే... అంతరిక్షమంత ఖ్యాతి సంపాదించడానికి ఇలా చేశాడు. హమద్‌ చర్యను విమర్శించేవాళ్లు ఉన్నారు కానీ...ఏ మాటకామాట. డబ్బున్న మారాజు ఏం చేసినా... అందంగానే ఉంటుంది కదా...

విలాస పురుషుడు
కారు చూసి దాని ఓనర్‌ ఖరీదు చెప్పమన్నారు కాస్ట్‌లీ పర్సన్స్‌. ఈ సామెత హమద్‌కు చాలా ఇష్టం. అందుకే తన రేంజ్‌కు దగ్గ స్థాయిలో కార్లు కొని పారేస్తుంటాడు ఈ బిలియనీర్‌. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లన్నీ హమద్‌ దగ్గరున్నాయి. కేవలం కార్లే కాదండోయ్‌. ఏకంగా కార్‌ మ్యూజియమే ఉంది ఈ దుబాయ్‌ షేక్‌ దగ్గర. ఒకటి కాదు...రెండు కాదు...200 కార్లు హమద్‌ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అన్నీ మోస్ట్‌ రిచ్‌ అండ్‌ మోడ్రన్‌ కార్సే. వాటిలో రెయిన్‌ బో గ్రూప్‌ వెరీ వెరీ స్పెషల్‌. మెర్సిడాస్‌ బెంజ్ 500 SEL మోడల్‌ కార్లు ఏడు ఈ రెయిన్‌ బో గ్రూప్‌లో ఉన్నాయి. ఇంధ్రధనస్సులోని ఏడు రంగులను ఒక్కో కారుకు ఒక్కోకలర్‌గా వేయించాడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందన్న సినీ డైలాగ్‌ ఈ మ్యూజియానికి ట్యాగ్‌ లైన్‌గా పెట్టేయచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. ఈ మధ్యనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును హమద్‌ కొనిపారేశాడు. దాని రేటు మన కరెన్సీలో చెప్పాలంటే జస్ట్‌....13 కోట్ల 50 లక్షలు మాత్రమే.
హమద్‌ దగ్గర ఉన్న సూపర్‌సైజ్‌ పవర్‌ వ్యాగన్‌ మరో వండర్‌. ఒరిజనల్‌ వ్యాగన్‌కు ఎనిమిది రెట్లు పెద్దగా ఉండే దీని ముందు....మాములు కార్లు బొమ్మల్లా కనిపిస్తాయి. 4 బెడ్‌రూమ్స్‌తో అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో వ్యాగన్‌ లోపలి భాగం ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే...హమద్‌ దగ్గరున్న ప్రతి కారు ఓ అద్భుతమే. ఇన్ని కార్లు దేనికి అన్న కామన్‌ మ్యాన్‌ క్వశ్చన్‌కు ఈ కాస్ట్‌లీ షేక్‌ ఇచ్చే ఆన్సర్‌ ఒక్కటే. కార్లు...ఓనర్‌ రేంజ్‌ను డిసైడ్‌‌ చేస్తాయి. ఇంత వెరైటీ పురుషుడికి ఓ దీవిలో.. అందులో అంతరిక్షంలో కనిపించేలా పేరుండడం తప్పా.. చెప్పండి..!

Search This Blog