Wednesday, October 26, 2011

దీపావళి


నిజమైన దీపావళి

బాలప్రభ
బాలలూ..దీపావళి పండుగ ఎపðడెపðడొస్తుందా.. బోలెడన్ని టపాసులు కాలుస్తామా ఆని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కదూ! దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. అన్ని వయసుల వారు ఆనందోత్సాహాలతో ఆడిపాడుతూ చేసుకుంటారు ఈ పండుగను. ఈ పండుగను అన్ని వయ సులవారు (చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా) ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.
దీపావళి వచ్చిందంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, టపాకాయలు (క్రాకర్స్‌) కాల్చడం వరకే చాలామంది పిల్లలకు తెలుసు. కానీ దీపావళి పండుగ ఎలావచ్చింది, దాని ప్రాముఖ్యత ఏమిటన్న విషయాన్ని మనమిపðడు తెలుసుకుందాం.
దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. దీనికి సంబం ధించి కొన్ని కథలు, ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండుగ గురించి గమనిస్తే, ఈ పండుగ విశిష్ఠత తెలు స్తుంది.
ఒకానొక యుగంలో నరకాసురుడనే రాక్షసుదు మొత్తం సృష్ఠిపై అధిపత్యం కోసం యుద్ధం చేసేవాడు. పరమాత్ముడు నరకాసురుని సంహరించి సృష్టికి నరకుని భయం నుండి విముక్తి కల్పించాడు. దేవతలను కూడా నరకాసురుని బంధనం నుండి విడిపించాడు.
ఈ కథ ఆధారంగానే దీపావళి పండుగకి ముందు రాత్రిని 'నరక చతుర్దశి' పేరిట మనమందరమూ జరుపు కుంటున్నాం. దీనికి మరోపేరు 'చిన్న దీపావళి'. తదనం తరం కార్తీక అమావాస్యను పెద్ద దీపావళిగా పేర్కొంటూ మహౌత్సాహంతో జరుపుకుంటారు.
మరో కథనం ప్రకారం దైత్యుల రాజైన బలి మొత్తం సమస్త భూమండలాన్ని ఏకచత్రాధిపతిగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ కాలంలోనే భూమిపై రాక్షసత్వం ప్రబల సాగింది. ధర్మ, నియమ,నిష్ఠలు వక్రమార్గం పట్టాయి. ఇదే క్రమంలో రాజాబలి శ్రీలక్ష్మిని, దేవ దేవతలను సయితం తన కారాగారంలో బంధించాడు.
ఈ విషయం తెలుసుకున్న పరమాత్ముడు రాజాబలి వంటి అసురశక్తిపై విజయం సాధించి కారాగారంలో చిత్రహింస అనుభవస్తున్న శ్రీలక్ష్మి ఇతరదేవతలకు విముక్తి కల్పించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా రాత్రి దీపోత్సవము జరుపుకుంటారని ప్రతీతి. ఈ పండు గనాడు ఇంటిముంగిట కల్లాపిజల్లి, రంగవల్లులు అద్ది, అందంగా అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరిచి శ్రీలక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
ఈ విభిన్న కథనాలను పరిశీలిస్తే, జ్ఞానులు దీనిని నరకాసుర మాయగా పేర్కొంటారు. కామ,క్రోద, వెూహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలుగా పేర్కొంటూ, అలాంటి అసుర లక్షణాలపై విజయం సాధించడానికి సంకేతంగా ఈ పండుగను జరుపు కుంటారని చెబుతారు.
గీతాసారంలో మరో అర్థం చెప్పబడింది. కలియుగ అంతం సమయంలో స్త్రీ,పురుషులు ఇలాంటి వికారాలకు గురవుతారని, అపðడు ఈ సృష్టి నరకంగా మారుతుందని, పరమాత్మ వికారాల రూపంలో ఉన్న నరకాసురుని అంతం చేశాడని చెబుతారు.
మరోకథనం ప్రకారం దీపావళి పండుగను రాముడు రావణునిపై విజయం సాధించిన దానికి ప్రతీకగా జరుపు కుంటారని చెబుతారు. విజయం అనంతరం మాల్యాదయుక్త మైన రామరాజ్యం ప్రారంభస్మరణ ఉత్సవంగా జరుపుకుం టారు. రావణుడు అసుర శక్తి కాగా రాముడు ఈశ్వరీయశక్తి గా పేర్కొంటారు.
దంతేదస్‌:
చిన్నదీపావళి, పెద్ద దీపావళి ఈ రెండింటి కంటే ముందువచ్చే చీకటి రాత్రినే 'దంతేదస్‌' అంటారు. ఈ పండుగ దినాన దీపదానం చేయడం ప్రత్యేకత. ఎవరైతే దీప దానం చేస్తారో వారు అకాలమృత్యువునుండి రక్షింపబడతారని, దీపదానం చేయడమంటే జ్ఞానదానం చేయడమేనంటారు.
మట్టితో చేసినదీపాలను దానం చేయడం శ్రేయస్కరం.
నేడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, స్వార్థం, అసూయ, ఈర్ష్యలతో జీవితాలను నరకంగా మార్చుకొని, ప్రజలు గాడాంధకారంలో,పేదరికంలో జీవిస్తున్నారు. అందుకే ప్రజలకు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు ప్రయత్నం చేయడం ద్వారా మాన వాళిని జ్ఞానమార్గం వైపు నడిపించవచ్చు.
ఈ పండుగ వెనుక ఉన్న కథనాలలోని పరమార్థం అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించడంగా చెబు తారు.
పిల్లలూ.. దీపావళి పండుగ గురించి తెలుసుకున్నారు కదా! ఈ పండుగనాడు మీరు టపాసులను కాల్చేటపðడు జాగ్రత్తగా ఉంటూ ఈ పండుగను జరుపుకోవాలి సుమా!

Search This Blog