Mayurasana
మయూరాసనం :
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.ప్రయోజనం :
ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. ఎంతో కాలం నుంచి వేధించే మలబద్ధకం అయినా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా దోషాలు తగ్గుతాయి.