Wednesday, January 12, 2011

YOGA



ఊష్ట్రాసనం  :
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.
ప్రయోజనం :
మనం చేసే రోజువారీ పనుల్లో ఎక్కువ సమయం ముందుకు వంగి చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలు దగ్గరై.. వాటి నడుమ ఉన్న గ్రంధులు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనంలో వెనక్కి వంగడం వల్ల రక్తప్రసరణ జరగని భాగాలు సర్దుకుంటాయి. మెడభాగం (సర్వికల్), నడుము మధ్య భాగం ( డోర్సల్) , నడుం కిందిభాగం (లంబార్) ఆరోగ్యంగా ఉంటాయి.

Search This Blog