Saturday, January 1, 2011

ARTICLES






 డబ్బు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే ఆ సోదిలే అనుకునేదాన్ని. కాని పెరుగుతున్న బాధ్యతలు, అవసరాలు, చుట్టూ వున్నవాళ్ళతో పోలికలు, కనిపిస్తున్న అసమానతలు, హంగులు, ఆర్భాటాలు అలోచించేలా, ఆశ పుట్టేలా చేస్తాయి. డబ్బు నిజంగానే గౌరవం తెస్తుంది. అస్సలు మనం ఎదుటి వళ్ళకి ఏ మాత్రం విలువ, పాడు ఇవ్వకపోయినా వాళ్ళు మాత్రం మనకి విలువ ఇచేలా చేసేస్తుంది అదేంటో వింతగా. అలా అని కక్కుర్తిపడి డబ్బు కోసం ఎవరి దగ్గరన్న చేయి చాస్తే, తేరగా వచ్చేదాని కోసం ఆశ పడితే అసలు మన విలువే పోయేలా చేస్తుంది.డబ్బు అనేది చాలా విషయాల్ని మార్చగలదు. మనుషుల్ని ఆడించగలదు.

నిజంగా అది పుట్టించే ఆశ వుంది చూసారు మహా డేంజరస్. అందుకే డబ్బు విలువ గుర్తించాలి. డబ్బుని ప్రేమించాలి, గౌరవించాలి. ఓపికుంటె కష్టపడి తెలివిగా సంపాదించాలి. లేదంటే వున్నదాంతో బిందాస్గా గడిపెయ్యాలి. అందులో కొంతైనా అక్కర్లేని హంగులకి పోకుందా, అవసరమైన వాళ్ళకిచ్చి దాని విలువ పెంచాలి. "కాని దానికి బానిస మాత్రం కాకూడడు" . ఇదీ నేను నేర్చుకున్న పాఠం.అందుకేమనం కనీసం కొన్ని సార్లు అయీనాబీద బిక్కి కి సయం చేయాలి అప్పుడే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది .ఇది రఘు పాటించేది .రండి మీరు చేయి కలపండి మా sasm trust & INSPIRE VOLUNTARY  ORGANISATION తో .ఉంటా మరి మీ రాఘవేంద్ర .

Search This Blog