Friday, April 15, 2011

కవితలు

 
 
 
కళ్ళిచ్చి వాడు
వొట్టి చూపే ఇస్తే
ఆ దేవుణ్ణి నేను శపించే వాణ్ణి!
వాడు మంచాడు
అందుకే ... కన్నీరిచ్చాడు!!
కన్నీటి బిందువుని
మించిన కావ్యం
నాకు కనపళ్ళేదు
రుద్రుడు కరుణా సముద్రుడు
గంగని భగీరధుడికీ
కన్నీటి బొట్లను భారతావనికీ
ఇచ్చాడు!!
కన్నీటి బొట్టు పుటక తెలిస్తే
గుండె చెరువౌతుంది
అది సముద్రంలో కలిస్తే
మనసు తేలికౌతుంది
సృష్టికర్త
పగటి కన్నీటి బొట్టు పేరు
సూర్యుడు..
రాత్రి అశ్రుబిందువు పేరు చంద్రుడూ...
మధ్యలో ఉండే ఏడుపు పేరే..
మనిషి !!!
(చాలాసార్లు నాకు కన్నీళ్ళొచ్చాక ... బాధ కన్నా
... ఆనందమే కలిగింది మరి.......)

Search This Blog