Saturday, October 1, 2011

మీరు కంప్యూటర్ పురుగా?

మీరు కంప్యూటర్ పురుగా?




 
మీరు సదా కంప్యూటర్ గురించే ఆలోచిస్తూ, దాంతోనే పనిచేస్తూ దాని గురించే మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారా? అయతే మీరు కంప్యూటర్ పురుగా? ఔనా కాదా! మీరే తేల్చుకోండి.
ఏదైనా వస్తువును లెక్కపెట్టమంటే 1,2,3,4,5,6,7,8,9,0, A,B,C,D.. అని లెక్కిస్తున్నారా?
బస్ ఎప్పుడొస్తుందీ అంటే 16 బిట్ బస్సా? 32 బిట్ బస్సా, లేక 64 బిట్‌దా అని అడిగేస్తున్నారా?
పుస్తకం చదివేటప్పుడు నెక్ట్స్ బటన్ ఎక్కడా అని గానీ,Scrol bar ఎక్కడా అని గానీ వెదికేస్తున్నారా?
లిఫ్ట్‌లో మీరెళ్ళాల్సిన ఫ్లోర్ నెంబర్‌ను ఒకసారి కాకుండా రెండుసార్లు (డబుల్ క్లిక్) నొక్కేస్తున్నారా?
మీ ఐటి అడ్రస్ అడిగితే, ఈ-మెయిల్ అడ్రస్ చెప్పేస్తున్నారా?
మీ కలలెలా వస్తున్నారుూ అంటే, 16.7 మిలియన్ కలర్స్‌లో అనేస్తున్నారా?
స్వీట్ డ్రీమ్స్ అనేందుకు బదులు గుడ్‌నైట్.కామ్ అనో, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు డాట్ స్లీప్/ స్వీట్ డ్రీమ్స్ అనో అంటున్నారా?
అయతే జాగ్రత్త పడండి! మీరు పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనే సమాధానం చెబితే మీరొక ‘కంప్యూటర్ వర్మ్’ లేదా ‘కంప్యూటర్ పురుగు’ అన్నమాటే. కంప్యూటర్ అడక్షన్‌కిది ప్రతీక అన్నమాట. సో బీకేర్ ఫుల్!....




courtesy.....( THIS ARTICLE TAKING FROM ANDRABOOMI)..

Search This Blog